దిగొచ్చిన హమాస్

దిగొచ్చిన హమాస్
ఆంద్రప్రభ వెబ్ డెస్క్ : ఇజ్రాయెల్ – హమాస్ల(Israel – Hamas) మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నయుద్ధాన్నిఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఓ ప్రణాళికను రూపొందించారు. దీనిని అంగీకరించకపోతే నరకం చూపిస్తానంటూ హమాస్ దేశానికి తీవ్ర హెచ్చరికలు చేశారు. దీంతో హమాస్ (Hamas) కాస్తా దిగొచ్చింది. ట్రంప్ ప్రణాళిక ప్రకారం తమ చెరలోని ఇజ్రాయెల్ (1) బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
అయితే, ఆయన ప్రతిపాదించిన కొన్ని అంశాల్లోని విషయాలపై చర్చలు జరపాల్సి ఉందని పేర్కొంది. ఈ చర్చలు వెంటనే జరగాలని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. గాజా పరిపాలన(Gaza administration)ను స్వతంత్ర సాంకేతిక నిపుణుల పాలస్తీనా సంస్థకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా యుద్ధం ముగించి, శాంతి నెలకొల్పేందుకు అరబ్, ఇస్లామిక్(Islamic), అంతర్జాతీయ భాగస్వాములతోపాటు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలిపింది.
