Deputy Sarpanch | పాఠశాల అభివృద్ధికి సహకారం

Deputy Sarpanch | పాఠశాల అభివృద్ధికి సహకారం
Deputy Sarpanch | ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని గ్రామ ఉప సర్పంచ్ నీలం కృష్ణ స్పష్టం చేశారు. ఆయన ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా బోధన విధానం, విద్యార్థుల హాజరు, మౌలిక వసతులు, ఎదురవుతున్న సమస్యలపై సవివరంగా చర్చించారు. పాఠశాలలో ఉన్న మౌలిక వసతుల లోపాలు, తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర అంశాలను ప్రధానోపాధ్యాయులు జోన్స్ ను అడిగి తెలుసుకున్నారు. విద్యాభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే, ఎంపీతో పాటు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి గ్రామ సర్పంచ్ సహకారంతో అన్ని విధాలా కృషి చేస్తానని ఉప సర్పంచ్ నీలం కృష్ణ తెలిపారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సేవలను ఆయన కొనియాడుతూ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి గ్రామ పాలకవర్గం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కృష్ణ హామీ ఇచ్చారు.
