Dental camp | ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు…

Dental camp | ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు…

Dental camp | చిట్యాల, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రజలకు కామినేని డెంటల్ కళాశాల ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచిత దంత వైద్య శిబిరం(Dental camp) ఏర్పాటు చేయడం అభినందనీయమని సర్పంచ్ కాటం వెంకటేశం అన్నారు. ఈ రోజు మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో కామినేని డెంటల్ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత దంత శిబిరాన్ని సర్పంచ్ కాటం వెంకటేశం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దంత సమస్యలు ఉన్నవారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించడం, వైద్యం అవసరమేరకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా యాజమాన్య కల్పించినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు మెంబర్లు యాదయ్య, తెలుసూరి నరసింహ, పంచాయతీ సెక్రటరీ గౌతంరెడ్డి, పి ఆర్ ఓ చంద్రశేఖర్, దంత వైద్యులు పార్ధ, పి సాహిత, పి దినేష్, ఎం సింధుజ తదితరు పాల్గొన్నారు.

Dental camp |

Leave a Reply