మ‌ణికొండ‌లో అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌

ఆంధ్రప్ర‌భ వెబ్ డెస్క్ : హైద‌రాబాద్ (Hyderabad) శివారు భూముల‌కు కోట్ల రూపాయ‌ల విలువ ఉండ‌టంతో అక్ర‌మార్కులు అడ్డ‌గోలుగా క‌బ్జా చేస్తున్నారు. ప్ర‌భుత్వ భూముల‌ను ఆక్ర‌మిస్తూ నిర్మాణాలు చేప‌డుతున్నారు. స్థానిక రాజకీయ నాయకులు (politicians), రియల్టర్లు (realtors), బిల్డర్లు, కబ్జాదారుల అండతో ప్రభుత్వ స్థలాలను, చెరువులు, కుంటల శిఖం భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు.

తాజాగా మణికొండ మున్సిపాలిటీ (Manikonda Municipality)లోని పుప్పాలగూడలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారుల (Hydra officials)కు ఫిర్యాదు అందింది. దీంతో వారు రంగంలోకి దిగి కొరడా ఝుళిపించారు. నెమలి నగర్లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కబ్జా కోరులు ప్లాట్లు చేశారు. 500 గజాల ప్రభుత్వ భూమి కబ్జా చేసి 5 ప్లాట్లు చేసి నిర్మాణాలు చేపట్టారు. బుధవారం ఉదయం భారీ బందోబస్తుతో ఈ అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. కబ్జా చేసిన నిర్మాణాలను నేల మట్టం చేసి ప్రభుత్వ బోర్డులు పాతారు.

Leave a Reply