ఇసుక క్వారీ డబ్బులు ఇవ్వాలని డిమాండ్
ముత్తారం, ఆంధ్రప్రభ : ఇసుక క్వారీలో లోడింగ్(Loading at the sand quarry) చేసిన డబ్బులు ఇచ్చే వరకు పచ్చి మంచినీళ్లు కూడా తాగనంటూ.. ఓ కాంట్రాక్టర్(contractor) రెండు రోజులుగా ఆమరణ దీక్షకు దిగిన ఉదంతం పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో చోటు చేసుకుంది.
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం జిల్లెల్లపల్లి(Jillelapalli) ఇసుక క్వారీలో లోడింగ్ డబ్బులు 17 లక్షలు ఇవ్వకుండా క్వారీ యజమాని వేధిస్తున్నాడని ఇసుక డంపింగ్(sand dumping) చేసిన కాంట్రాక్టర్ గొట్టిపాటి ప్రేమ్ కుమార్ గత రెండు రోజులు(two days)గా నీళ్లు కూడా తాగకుండా జిల్లెల్లపల్లి క్వారీ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేంత వరకు ఆమరణ దీక్ష విరమించేది లేదని భీష్మించుకున్నాడు.