Delhi | బీసీ రిజర్వేషన్లపై రన్ ఫర్ జస్టిస్…

Delhi | బీసీ రిజర్వేషన్లపై రన్ ఫర్ జస్టిస్…
Nagar Kurnool | కల్వకుర్తి, ఆంధ్రప్రభ : 42 శాతం బీసీ రిజర్వేషన్ల(Reservations) సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని బీసీ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈ రోజు కల్వకుర్తిలో శివాజీ చౌక్(Shivaji Chowk in Kalwakurti) నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు రన్ ఫర్ సోషల్ జస్టిస్(Run for Social Justice) కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బీసీ జేఏసి నాయకులు మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదని నాయకులు పేర్కొన్నారు. రిజర్వేషన్ల సాధన ఉద్యమంలో బీసీలందరూ కదిలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీ(Delhi)కి తీసుకెళ్లి రాష్ట్రపతిని కలవాలని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బీసీ జేఏసి నాయకులు ఆనంద్ కుమార్(Anand Kumar), సదానందం గౌడు, రాజేందర్, రమేష్ బాబు, రమేష్ చారి, బానుచందర్, తాళ్ళ సురేష్ గౌడు, దామోదర్ గౌడ్, కృష్ణయ్య, సుధాకర్, రాజు, సురేందర్ గౌడు, బాబిదేవ్, సతీష్, సంతు యాదవ్, దారమోని గణేష్, శ్రీనివాస్, లింగం తదితరులు పాల్గొన్నారు.
