Delhi Election Results – మరి కొద్దిసేపట్లో తేలనున్న అప్, బీజేపీ భవితవ్యం
ఢిల్లీ అధికార పీఠం ఎవరికి దక్కుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. నేడే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 8 గంటల నుంచి 19 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రారంభం కానుంది. హస్తినలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఎన్నికల్లో 60.54 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
పోలింగ్ ఆసక్తిగా జరగడంతో.. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల్లో ఏది గెలుస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. ఇవాళ ఉదయం 8 గంటలకు ఓట్ల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది అని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. కౌంటింగ్ కోసం పూర్తి ఏర్పాట్లు చేశామని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) అలిస్ వాజ్ తెలిపారు. సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు, సహాయక సిబ్బంది మొత్తం 5 వేల మందిని నియమించినట్లు తెలిపారు. కౌంటింగ్ మొదలయ్యే ముందు ప్రతీ నియోజకవర్గం నుంచి ర్యాండమ్‌గా 5 వీవీ పాట్లను లెక్కించి, ఈవీఎం ఓట్లతో పోల్చి చూస్తారు. అంతా కరెక్టుగా ఉంటేనే.. కౌంటింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల లోగా కౌంటింగ్ పూర్తవుతుందని అంచనా. ఫలితాలను కూడా ఇవాళే ప్రకటిస్తారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు