PBKS vs DC | పంజాబ్ కి ఢిల్లీ దెద్బ !

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ సీజ‌న్ లో త‌మ ఆక‌రి మ్యాచ్ ఆడిన ఢిల్లీ.. బలమైన పంజాబ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి, సీజ‌న్ ను విజ‌యంతో ముగించింది. తమ ఆఖ‌రి మ్యాచ్ లో బలమైన పంజాబ్ ను 6 వికెట్ల తేడాతో ఓడించిన ఢిల్లీ, సీజన్ ను విజయంతో ముగించింది.

అయితే, ఈ విజయంతో ఢిల్లీకి ఎలాంటి లాభం లేకపోయినప్పటికీ… పంజాబ్ జ‌ట్టుకు అగ్రస్థానం ఆశ‌లకు గండి ప‌డినట్టైంది.

కాగా, ఈ మ్యాచ్ లో 207 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ… ఆది నుంచే దూకుడుగా ఆడింది ఓవైపు వికెట్లు పడుతున్నా.. పంజాబ్ బౌలర్ లను ధాటిగా ఎదుర్కుంటూ.. కావాల్సిన పరుగులు దంచేసింది.

ఈ క్రమంలో ఈ సీజన్ లో కన్సిస్టెన్సీతో ఆడిని కేఎల్ రాహుల్ (35), కెప్టెన్ ఫాఫ్ డూప్లిసిస్ (23), సెదికుల్లా అటల్ (22) రాణించగా.. కరుణ్ నాయర్ (44) అదరగొట్టాడు. ఇక సమీర్ రిజ్వీ (58) అర్ధశతకంతో అజేయంగా నిలవకగా.. ట్రిస్టన్ స్టబ్స్ (18) నాటౌట గా నిలిచాడు.

ఇక పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ రెండు వికెట్లు తీయ‌గా… మార్కో జాన్సెన్, ప్రవీణ్ దూబే ఒక్కో వికెట్ ప‌డ‌గొట్టారు.

Leave a Reply