Dekhlenge Saala | యూట్యూబ్ ని షేక్ చేస్తోన్న పవర్ స్టార్..
Dekhlenge Saala, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : గబ్బర్ సింగ్ సంచలన విజయం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్(The film Ustad Bhagat Singh). రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి తొలి గీతంగా దేఖ్‌లేంగే సాలా(Dekhlenge Sala) విడుదలైంది. ఈ సాంగ్ ఆవిష్కరణ కార్యక్రమం రాజమండ్రిలో జరిగింది. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు హరీష్ శంకర్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, నిర్మాత నవీన్ యెర్నేని, గీత రచయిత భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు.
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి విడుదలైన తొలి గీతం(First song) దేఖ్‌లేంగే సాలా అభిమానులు, సినీ ప్రేమికుల్లో ఒక్కసారిగా భారీ ఉత్సాహాన్ని రేపింది. ఉత్సాహభరితమైన సంగీతం, అద్భుతమైన నృత్య రీతులతో(With dance styles) రూపొందిన ఈ పాటలో పవన్ కళ్యాణ్.. అత్యంత ప్రజాదరణ పొందిన అవతారంలో కనిపిస్తున్నారు. ఆ స్టైల్, ఇంటెన్సిటీతో ఒకప్పుడు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆయన తన ఐకానిక్ బ్లాక్‌బస్టర్ పాటల జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేస్తున్నారు.

Dekhlenge Saala | బ్లాక్‌బస్టర్ త్రయం
ఈ పాటతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అనే బ్లాక్‌బస్టర్ త్రయం ఘనంగా మళ్లీ కలిసింది. గతంలో చార్ట్‌బస్టర్ పాటలు, గుర్తుండిపోయే మాస్ ఎంటర్టైనర్లను(Entertainers) అందించిన ఈ త్రయం, దేఖ్‌లేంగే సాలాతో తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. పదునైన దృష్టి, విశిష్టమైన సంగీత అవగాహనకు పేరుగాంచిన దర్శకుడు హరీష్ శంకర్.. మాస్ అంశాలను మేళవిస్తూ రూపొందించిన ఈ పాటలో తన నైపుణ్యాన్ని మరోసారి నిరూపించారు. ప్రతి బీట్, ప్రతి స్టెప్, ప్రతి ఫ్రేమ్ పై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ పాటకు ఆకర్షణ(The charm of the song)ను తీసుకొచ్చారు.
సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తన ఉత్సాహభరితమైన సంగీతంతో మరోసారి మాయ చేశారు. ప్రారంభం నుంచే శ్రోతలను ఆకట్టుకునేలా ఆయన ఈ పాటను స్వరపరిచి(Composed the song)న తీరు కట్టిపడేసింది. భాస్కరభట్ల రాసిన సాహిత్యం అందరూ పాడుకునేలా ఉండటమే కాకుండా, ప్రేరణ కలిగించేలా ఉంది. అలాగే, సినిమా ఎలా ఉండబోతుందో తెలిపేలా సాహిత్యం అద్భుతంగా కుదిరింది. ఇక విశాల్ దద్లానీ(Vishal Dadlani) గాత్రం పాటకు మరింత పవర్‌ను జోడించి, దీనిని ఖచ్చితంగా అందరూ ఇష్టపడే గీతంగా మార్చింది. ఈ సాంగ్ ఇలా రిలీజ్ అయ్యిందే లేదో.. యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతుంది. మరి.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.


