ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ అయ్యారు. రక్షణ శాఖ అధికారులతో కలిసి రాజ్ నాథ్ సింగ్ ఢిల్లీలోని ప్రధాని నివాసానికి చేరుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో.. భద్రతా సన్నద్ధతపై మోదీకి రాజ్ నాథ్ సింగ్ వివరించారు. మరోవైపు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ తో నిన్న రాజ్ నాథ్ సింగ్ సమావేశమయ్యారు. ఆ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రధానికి వివరించనున్నారు. ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ థోబాల్ పాల్గొన్నారు.
Delhi | ప్రధాని మోడీతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ
