న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాజ్యాంగాన్ని మారుస్తున్నారంటూ రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ప్రచారం చేయడంపై తెలంగాణ బీజేపీ పిటీషన్ దాఖలు చేసింది. గతంలో ఇదే విషయమై ఆ పార్టీ పిటీషన్‌ను తెలంగాణ హైకోర్టు(Telangana High Court) కొట్టివేసింది. ఈ కొట్టివేతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు(Supreme Court)ను బీజేపీ ఆశ్రయించింది. తాజాగా వాదనలు విన్న సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్(CJI Justice BR Gavai)ధర్మాసనం పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. రాజకీయపరమైన అంశాల్లో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది.
పరువు నష్టం కేసు కొట్టివేత..

