భార్య,ఇద్దరు పిల్లల మృతి..

భార్య,ఇద్దరు పిల్లల మృతి..

  • సంచలన కేసు మిస్టరీని ఛేజించిన పోలీసులు
  • ఆడ పిల్ల జన్మనిస్తుందనే హత్యలు
  • పక్కా ప్లాన్ తో ముగ్గురిని హతమార్చిన కేటుగాడు
  • మైనర్ బాలికతో ప్రేమాయణం, ఆపై పెళ్లికి స్కెచ్
  • 9మంది అరెస్ట్,పరారీలో మరో ఇద్దరు నిందితులు
  • వివరాలు వెల్లడించిన వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్

వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ ; రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన భార్య,ఇద్దరు బాలికల మృతి కేసును వరంగల్ పోలీసులు ఛేజించారు.ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, మూడవ కాన్పులో సైతం మళ్లీ వారసుడు కాకుండా అమ్మాయే పుడుతుందనే అనుమానంతో పక్కా ప్లాన్ తో ముగ్గురిని మర్డర్ చేసిన్నట్లు పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య, ఇద్దరు పిల్లలను ఐస్ క్రీమ్ తిందామని నమ్మించి,వారిని వారి సొంతమైన స్విమ్మింగ్ ఫుల్ వద్దకు తీసుకెళ్లి నీటిలోకి తోసేసి మృతికి కారణమయ్యాడు.

ముగ్గురిని కడతేర్చే సమయంలో ముందుస్తూ ప్లాన్ మేరకు స్విమ్మింగ్ పూల్ వద్ద సిసి కెమెరాలు, కరెంటు నిలిపి వేసి మర్డర్స్ ను కాస్తా ప్రమాదవశాత్తు ఘటనగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన్నట్లు వరంగల్ పోలీసులు తేల్చారు. ఈ కేసులో హత్య గురైన మృతురాలి భర్తతో పాటు ఈ హత్యలకు పరోక్షంగా కారణంగా నిలిచిన మరో తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో ప్రధాన నిందితుడు వరంగల్ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామానికి చెందిన మహ్మద్ అజారుద్దీన్ (29)తో పాటు, నిందితుడి కుటుంబ సభ్యులు పున్నెలు గ్రామానికి చెందిన యం.డి చాంద్‌పాషా (49), యం.డి సలీహా (45), యం.డి షరోద్దీన్ (25)లతో పాటు బసిక స్రవంతి(32) కడిపికొండ, బాల్నె పార్ధు (47) నెక్కొండ, బొమ్మెర మనోహర్(39) గీసుగొండ, లింగాల నరేష్(37) కొండపర్తి, సాట్లరాజు (32) పున్నెలు, వాకుదోట్ భద్రు (60) ఎనుగల్లు చెందిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.

మరో ఇద్దరు నిందితులు డా.బాల్నె పూర్ణిమ, డా. ఎస్.రవళీలు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఐనవోలు మండలం పున్నెలు గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు అజారుద్దీన్ ఇదే గ్రామానికి చెందిన మృతురాలు ఫరహాత్‌ను 2016 లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి హుమేరా (9), ఆయేషా (6)లకు జన్మనిచ్చారు. కాని నిందితుడి కుటుంబ సభ్యులకు వారసుడు కావాలనే కోరిక వుండేది. 2021, 2022 సంవత్సరాల్లో మృతురాలు ఫరహాత్‌ గర్భం దాల్చారు.

తిరిగి అడ పిల్లకు జన్మనిస్తుందనే అపనమ్మకంతో ప్రధాన నిందితుడితో పాటు అతని కుటుంబ సభ్యులు పున్నెలు గ్రామానికి చెందిన మందుల షాపు నిర్వహిస్తున్న సట్ల రాజుతో పాటు మిగితా నిందితులు ఆర్.యం.పి వైద్యుడైన నరేష్,ల్యాబ్ టెక్నిషియన్ మనోహర్, కాజీపేటలోని సురక్షా హస్పటల్ డాక్టర్ రవళి,నర్సు స్రవంతి, నెక్కోండకు చెందిన ఉపేందర్, మరో హస్పటల్ డాక్టర్ పూర్ణిమల సహకారంతో నిందితుడు మృతిరాలికి లింగా నిర్థారణ పరీక్షలు చేయించారు. పుట్టబోయేది ఆడ పిల్లయని నిర్థారించుకోని మృతురాలికి ఇష్టం లేకున్నా రెండు దఫాలు నిందితుడు మృతిరాలికి ఆబార్షన్ చేయించారు.

ఇదే సమయంలో నిందితుడి దూరపు బంధువైన మైనర్ బాలికపై ప్రేమను పెంచుకొన్నాడు. నిందితుడు పెళ్ళి చేసుకుంటానని మైనర్ బాలికను నిందితుడైన అజారోద్దీన్ పెళ్లి చేసుకొంటానని నమ్మించే ప్రయత్నం చేశాడు. ముందే పెళ్ళి అయి ఇద్దరు పిల్లలు ఉన్న వారిని వదిలి తనను పెళ్ళి చేసుకొంటాననే నిర్ణయాన్ని మైనర్ బాలిక నిరాకరించింది.తన భార్య పిల్లలు వుండటం వల్లే మైనర్ బాలిక పెళ్ళికి అంగీకరించడం లేదని భార్య పిల్లలపై నిందితుడు కక్ష్య పెంచు కున్నాడు. ఈ ఏడాది మార్చి నెలలో మృతురాలు ఫరహాత్ గర్భం దాల్చడంతో తమకు తిరిగి ఆడపిల్ల జన్మనిస్తుందనే భయంతో నిందితుడుతో పాటు తల్లిదండ్రులు,తమ్ముడు అబార్షన్ చేయించుకోవాలని పలుమార్లు మృతురాలితో గోడవ పడ్డారు.

అలాగే తను ప్రస్తుతం ప్రేమిస్తున్న బాలికను పెళ్ళి చేసుకోవాలంటే భార్య,పిల్లలు బ్రతికుండగా సాధ్యం కాదన్న నెపంతో వారిని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ రచించాడు.భార్య,పిల్లలను చంపడం అన్నీంటికి పరిష్కారమని నిందితుడు భావించాడు.నిందితుడు.ఇందుకోసం తాను అనుకున్న ప్రణాళిక ప్రకారం ఈ నెల 1వ తారీఖు రాత్రి సుమారు 7.50 గంటలకు ఐస్ క్రీం తినిపిస్తానని భార్య పిల్లలను తాను నిర్వహిస్తున్న స్విమ్మింగ్ పూల్ వద్దకు కారులో తీసుకు వెళ్ళాడు. ముందస్తు ప్లాన్ ప్రకారం నిందితుడు ముందు గానే స్విమ్మింగ్ పూల్ వద్ద సిసి కెమెరాలు, కరెంటు నిలిపి వేశాడు.

స్విమ్మింగ్ ఫుల్ చేరుకున్న నిందితుడు అజారోద్దీన్ ముగ్గురిని బలవంతంగా స్విమ్మింగ్‌లోకి తోసేశాడు.స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయిన భార్య పిల్లలను బలవంతంగా వారు చనిపోయే వరకు వారిని నీటిలో ముంచి కిరాతకంగా హత్య చేసాడు. ఈ ముగ్గురిని హత్య చేసిన అనంతరం నిందితుడు వీరు మరణించినట్లుగా నిర్థారించుకోని తన భార్య పిల్లలు స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చేందారని ప్రచారం చెశాడు.మృతిరాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని నిందితుడు ఆజారుద్దీన్ తన భార్య పిల్లలలను దారుణంగా హత్య చేసినట్లుగా నిర్థారణకు వచ్చారు.

పట్టుబడిన నిందితుల్లో స్రవంతిపై మూడు కేసులు, డా. పార్దు మీద నాలుగు కేసులు, ప్రస్తుతం పరారీ లో వున్న డా. పూర్ణిమ పై మరో నాలుగు కేసులు ఉన్నట్లుగా పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఈ హత్యలకు పాల్పడిన నిందితుడిని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.గురువారం సాయంత్రం పోలీసులకు పట్టుపడటం జరిగిందని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ కేసును పరిష్కరించడంతో పాటు నిందితుడుని పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, మామూనూర్ ఏసీపీ వెంకటేష్ పర్వతగిరి సిఐ రాజగోపాల్, గీసుగొండ ఇన్స్ స్పెక్టర్ విశ్వేశ్వర్, మామూనూర్ ఇన్స్ స్పెక్టర్ శ్రీనివాస్, ఐనవోలు, పర్వతగిరి,మామూనూర్ ఎసైలు శ్రీనివాస్, ప్రవీణ్, శ్రీకాంత్, కానిస్టేబుళ్లు హేమకుమార్, శ్రీనివాస్ లను పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.

Leave a Reply