ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం జంగేడు గ్రామానికి చెందిన సమ్మెట సమ్మయ్య భార్య సమ్మెట భాగ్య (55) రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జయశంకర్ జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరం గ్రామంలోని శ్రీ కాళేశ్వర ముక్తిశ్వర స్వామి దర్శించుకునేందుకు బుధవారం భార్య భర్తలు తమ ద్విచక్ర వాహనంపై వెళ్ళారు.
ఈ క్రమంలో జాతీయ రహదారి 353సి మహాదేవపూర్ – కాళేశ్వరం జాతీయ రహదారి అటవీ ప్రాంతంలోని మూల మలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భాగ్య మృతిచెందింది. మృతదేహన్ని మహాదేవపూర్ ఆస్పత్రికి తరలించారు. పండుగ పూట భాగ్య మృతి చెందడంతో జంగేడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
