DEAD | గుండెపోటుతో వార్డు సభ్యుడు మృతి

DEAD | నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ : నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వెంకటాపూర్లో (కొటాల గడ్డ) విషాదం చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో గ్రామ 7వ వార్డు సభ్యుడిగా కాంగ్రెస్ మద్దతుదారు మహేష్ విజయం సాధించారు. అయితే రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో మరణించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
