Dead | ట్యాంకర్ ఢీకొని..
- బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ మృతి
Dead | తిరుమలగిరి, ఆంధ్రప్రభ : ట్యాంకర్ ఢీకొట్టడంతో యూనియన్ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ మృతిచెందిన సంఘటన ఇవాళ మండలంలోని తొండ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… వేల్పుల సతీష్ (39) తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వరంగల్ నుంచి బైక్ పై తిరుమలగిరికి వస్తుండగా తొండ గ్రామం వద్ద ట్యాంకర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.

