De-limitation | ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..

De-limitation | ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..
De-limitation | హైదరాబాద్: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ అనేవి పూర్తిగా వేర్వేరు అంశాలని ఆయన స్పష్టం చేశారు. మహిళా కోటాను తక్షణమే అమలు చేయాలని తాము కోరుకుంటున్నామని, అయితే దాన్ని డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం సరికాదని హితవు పలికారు. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ప్రక్రియ వల్ల బీజేపీకి తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం కలగవచ్చేమో కానీ, దీర్ఘకాలంలో దేశానికి భారీ నష్టం వాటిల్లుతుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పార్టీ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్న ఆయన, డీలిమిటేషన్‌కు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరారు. ఈ సున్నితమైన అంశంపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి, జాతీయ ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి తన లేఖలో డిమాండ్ చేశారు.
