DCP Dharakavita | తప్పుడు ఫిర్యాదులు చేస్తే ఇక కేసులే..

DCP Dharakavita | తప్పుడు ఫిర్యాదులు చేస్తే ఇక కేసులే..
- దొంగగా అవతారమెత్తిన తాపీమేస్త్రీ
- చోరికి పాల్పడ్డ నిందితుడి అరెస్టు
- తాళం వేసిన ఇళ్లే టార్గెట్
- మద్యానికి బానిసై చోరీలు
- ఆసిఫాబాద్ నుండి హన్మకొండకు మకాం
- వారం రోజుల్లో దొంగను పట్టుకొన్న పోలీసులు
- సెంట్రల్ జోన్ డిసిపి ధారకవిత
వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : అతడో భవన నిర్మాణ కార్మికుడు….తాపీమేస్త్రీగా రోజుకూలీ సరిపోలేదు. మద్యానికి బానిసైన ప్రాణం అర్రులు చాచింది…అడ్డ దారుల్లో సంపాదించమని మనసు ఉరకలేసింది. అంతే….తాళాలేసిన ఇళ్ళను టార్గెట్ గా ఎంచుకున్నాడు. అంతే…తాపీపట్టి గోడలు కట్టిన చేత్తోనే తాళాలు పగలగొట్టడం మొదలెట్టాడు…ఇంట్లోకి జొరబడి దొరికింది దోచుకోవడం, అవలీలగా సంపాదించడంలో మజా కి అలవాటుపడ్డాడు…వివరాల్లోకి వెళ్తే….
కాకతీయ యూనివర్సిటీ పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసివున్న ఇండ్లల్లో చోరీకి పాల్పడుతున్న నిందితుడిని కెయూసి, సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా కలిసి శుక్రవారం అరెస్టు చేసారు. అరెస్టు చేసిన నిందితుడి నుండి పోలీసులు సూమారు ఐదు లక్షల విలువ గల 40 గ్రాముల బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత వెల్లడించారు. ఆసిఫాబాద్ జిల్లా తాండుర్ మండలం, రేచిని గ్రామం, ప్రస్తుతం హన్మకొండ పరిధిలో నివాసం వుంటున్న సబ్బాని రంజిత్(24) తాండూర్ ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికుడి పని చేస్తూ వచ్చిన డబ్బుతో మద్యం సేవిస్తూ జల్సాలు చేయడంతో తనకు వచ్చే అదాయం తన జల్సాలకు సరిపోక పోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు.
Murder @ 10 ₹ : బెజవాడలో దారుణం
ఇందు కోసం సబ్బాని రంజిత్ 2020 సంవత్సరంలో మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి పాల్పడటంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. జైలు నుండి విడుదలైన నిందితుడు తన కుటుంబంతో కల్సి గత మూడు సంవత్సరాలుగా కెయూసి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం వుంటున్నాడు. ఈ నెల 12వ తారీఖున నిందితుడు నివాసం వుంటున్న పరిసరాల్లోనే నివాసం ఉండే దంపతులు ఇంటికి తాళం వేసి సినిమాకి పోవడం గుర్తించి చోరీకి పాల్పడ్డాడు.
తప్పుడు ఫిర్యాదులు చేస్తే కేసులే: DCP వార్నింగ్
చోరీ ఘటనల్లో వాస్తవ విషయాలనే ఫిర్యాదులో పేర్కొనాలని వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి ధార కవిత సూచించారు. విధి నిర్వహణలో ఉండే పోలీసులను పక్కదారి పట్టించే రీతిలో తప్పుడు ఫిర్యాదులు చేస్తే ఇక నుండి బాధితులపై కూడా చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. చోరీ సొత్తుకు మించి బంగారు ఆభరణాలు పోయిన్నట్టు ఫిర్యాదులు చేసినా, దొంగ దొరికిన తర్వాత వాస్తవ విషయాలు బయట పడతాయని గుర్తించి తప్పుడు ఫిర్యాదులు చేస్తే సహించబోమని హెచ్చరించారు.
ఇకపై ఎవరైనా బాధితులు చోరీ గురైన సొమ్ము ఎక్కువ మొత్తంలో చోరీ జరిగినట్లుగా ఫిర్యాదులు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొవడం జరుగుతుందని డిసిపి ధార కవిత తెగేసి చెప్పారు. చోరీ కేసును వారం రోజుల్లోనే ఛేజించి పట్టుకొన్నట్లు డిసిపి తెలిపారు.
