DCP | ఇబ్బందులు లేకుండా చూడాలి..

DCP | ఇబ్బందులు లేకుండా చూడాలి..

  • విజయవాడ ట్రాఫిక్ అధికారులకు డీసీపీ దిశానిర్దేశం

DCP | విజయవాడ క్రైమ్, ఆంధ్రప్రభ : విజయవాడ పోలీసు కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు, నగర ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టారు. కొండ దిగువ ప్రాంతం నుంచి రథం వరకు భక్తుల వాహనాలు, ప్రజా రవాణా వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బారికేడ్లు, దిశానిర్దేశక గుర్తులను ఏర్పాటు చేశారు. వీటిని డీసీపీ స్వయంగా పరిశీలించారు.

ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. భక్తుల భద్రతతో పాటు వాహనదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని మార్గాలను నియంత్రించాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వంశీధర్ గౌడ్, ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు ఉమామహేశ్వరరావు, కిషోర్ బాబు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొని విధులను సమర్థవంతంగా నిర్వహించారు.

Leave a Reply