DC vs SRH | సన్ రైజ‌ర్స్ కు ఢిల్లీ షాక్ !

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ లో భాగంగా నేడు జ‌రిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఈజీ విక్ట‌రీ సాధించింది. విశాఖ వేదిక‌గా ఎస్ఆర్‌హెచ్‌తో తలపడిన ఢిల్లీ.. 7 వికెట్ల తేడాతో విజయం దక్కించుకుంది.

అద్భుతమైన బౌలింగ్, బ్యాటింగ్ & ఫీల్డింగ్‌లతో ఆల్ రౌండ్ ప్రదర్శన క‌న‌బ‌ర్చిన‌ ఢిల్లీ, ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఐద‌వ స్థానం నుంచి రెండవ స్థానానికి దూసుకొచ్చింది. ఇక ఈ ఓటమితో హైదరాబాద్ జట్టు 6 నుంచి 7వ స్థానానికి పడిపోయింది.

కాగా, ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఆరెంజ్ ఆర్మీ.. ఢిల్లీ బౌల‌ర్ల ధాటికి 18.5 ఓవ‌ర్ల‌లో 163 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. ఎస్‌ఆర్‌‌హెచ్‌ పతనంలో ఢిల్లీ బౌలర్లు మిచెల్ స్టార్క్(5/35), కుల్దీప్ యాదవ్ (3/23) మెరిశారు.

ఇక స్వ‌ల్ప టార్గెట్ తో ఛేజింగ్ కు వ‌చ్చిన క్యాపిట‌ల్స్.. 16 ఓవ‌ర్ల‌లోనే మ్యాచ్ ను ముగించేసింది. డు ప్లెసిస్ (27 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సుల‌తో 50) హాఫ్ సెంచ‌రీతో విజృంబించ‌గా.. జేక్ ఫ్రేజర్ (32 బంతుల్లో 38), కేఎల్ రాహుల్ (5 బంతుల్లో 2ఫోర్లు,1సిక్సుతో 15) రాణించారు. ఇక‌ అభిషేక్ పోరెల్ (18 బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్సుల‌తో 34), ట్రిస్టన్ స్టబ్స్ (14 బంతుల్లో 3ఫోర్లల‌తో 21) నాటౌట్ గా నిలిచారు.

అయితే, ఓపెనింగ్ జోడీ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ – ఫాఫ్ డు ప్లెసిస్ మొదటి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఎస్‌ఆర్‌‌హెచ్ బౌలర్లను బెంబేలెత్తించారు. ఆక‌ర్లో అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్ లు నాలుగో వికెట్ కు 51 పరుగులు జోడించి హైదరాబాద్ ను దెబ్బ‌తీశారు. అయితే హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో జీషన్ అన్సారీ మూడు వికెట్లు తీశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *