ఆహ్మాదాబాద్ – గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కో ర్ చేసింది.. నిర్దారిత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 203 పరుగులు చేసింది.. గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్ గెలవాలంటే 204 పరుగులు చేయాల్సి ఉంది.. ముందుగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి శుభారంభం దక్కింది. పవర్ ప్లేలో రనస్స్ చేసిన ఢిల్లీ భారీ స్కోర్ దిశగా పయనించింది. టాపార్డర్‌లో అభిషేక్ పొరెల్(18), కరుణ్ నాయర్(31)లు మరోసారి శుభారంభం ఇచ్చారు. .. అర్షద్ ఖాన్ ఈ జోడిని విడదీసి గుజరాత్‌కు బ్రేకిచ్చాడు. పొరెల్ తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్(28) ఉన్నంత సేపు ధనాధన్ ఆడాడు. వేగంగా ఢిల్లీ స్కోర్‌బోర్డును నడిపించాడు. రాహుల్‌ను ప్రసిధ్ కృష్ణ ఎల్బీగా వెనక్కి పంపాడు.ఇక ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో బౌండరీ బాదిన కరుణ్ నాయర్(31) ఆ తర్వాత కట్ షాట్ ఆడి బౌండరీ వద్ద అర్షద్ ఖాన్ చేతికి చిక్కాడు. దాంతో, 93 వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది.
అ తర్వాత 31 పరుగులు చేసిన స్లబ్స్ ను సిరాజ్ ఔట్ చేశాడు… ఇక 39 పరుగులు చేసిన కెప్టెన్ అక్షర్ కూడా అయిదో వికెట్ గా వెనుతిరిగాడు.. ఈ వికెట్ ప్రసిద్ద కృష్ణకు దక్కింది.. ఆ తర్వాత విప్రోజ్, ఫెరిరాలు వెంటవెంటనే పెవిలియన్ కు చేరారు.. ఇక అశుతోష్ శర్మ ధనా ధన్ బ్యాటింగ్ చేశాడు.. చివరి ఓవర్ లో అశుతోష్ ఔటయ్యాడు..అశుతోష్ 37 పరుగులు చేయగా ఈ వికెట్ సాయి కిషోర్ కు దక్కింది.
ఈ మ్యాచ్ లో ప్రసిధ్ద కృష్ణకు నాలుగు వికెట్లు లబించాయి.. సాయి కిషోర్, అర్షద్ ఖాన్, సిరాజ్, ఇషాంత్ శర్మలు ఒక్కో వికెట్ దక్కాయి