హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : టెట్రా ప్యాక్ సహకారంతో దళిత్ బహుజన్ రిసోర్స్ సెంటర్ (డీబీఆర్సీ) ఎన్ హేన్సింగ్ యాక్సెస్ టు ఎన్ టైటిల్మెంట్స్, లైవ్లీ హుడ్స్, హెల్త్ అండ్ ఎన్వైరన్ మెంటల్ స్టసనబిలిటీ ప్రాజెక్ట్ ను తిరుపతిలో ప్రారంభించింది. వ్యర్థాలు ఏరుకునే ప్రజల ఉన్నతి లక్ష్యంగా ప్రారంభించబడిన ఒక కొత్త కార్యక్రమం.
ఈ పనివారు నగర వ్యర్థాల నిర్వహణలో, రీసైక్లింగ్ వ్యవస్థలో కీలకమైన బాధ్యత వహిస్తారు కానీ తరచుగా ఆర్థికపరమైన సమస్యలు, సాంఘిక మినహాయింపులను ఎదుర్కొంటున్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ వారికి 10స్టీల్ తోపుడు బళ్లను విరాళంగా అందచేసిన ఒక ముఖ్యమైన కార్యక్రమం జరిగింది. తోపుడు బళ్లను అందచేసిన కార్యక్రమానికి చరణ తేజ, అదనపు కమిషనర్, అమరయ్య, డిప్యూటీ కమిషనర్ లు హాజరయ్యారు.
ఈసందర్భంగా అదనపు కమిషనర్ చరణ్ తేజ మాట్లాడుతూ… విద్య, జీవనోపాధి, సామాజిక మద్దతను మెరుగు పరచడమే కాకుండా, వ్యర్థాలను ఏరుకునే వారి – పర్యావరణ సుస్థిరత గుర్తింపు లేని ఈ ప్రజల అపురూపమైన తోడ్పాటును కూడా గుర్తించిన సమగ్రమైన కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు తాను డీబీఆర్సీ, టెట్రా ప్యాక్ లను శ్లాఘిస్తున్నానన్నారు.
ఈ కార్యక్రమానికి కమలేష్ ఖోలియా (స్టసనబిలిటి మేనేజర్, టెట్రా ప్యాక్ ) అల్లాడి దేవకుమార్ (సీఈఓ, డీబీఆర్సీ), సిహెచ్. శామ్యూల్ అనిల్ కుమార్ (డిప్యూటీ డైరెక్టర్ – ప్రోగ్రాంస్, డీబీఆర్సీ) కూడా హాజరయ్యారు. ఈ నిబద్ధత దీర్ఘకాలం ప్రభావం చూపిస్తుందని వీరు పునరుద్ఘాటించారు.
డీబీఆర్సీ డిప్యూటీ డైరెక్టర్ శామ్యూల్ అనిల్ కుమార్ మాట్లాడుతూ… తిరుపతిలో టెట్రా ప్యాక్ తో తమ భాగస్వామం జోక్యం కంటే అధికంగా ఉందన్నారు. వ్యర్థాలను ఏరుకునే వారికి ఇది ఒక వినూత్నమైన అవకాశమన్నారు.