Dantepally | ఖోఖో పోటీలో ద్వారక బాలికల ప్రతిభ..

Dantepally | దండేపల్లి, ఆంధ్రప్రభ : సీఎం కప్ నియోజకవర్గస్థాయి ఖోఖో పోటీలో దండేపల్లి మండలం ద్వారక బాలికలు ప్రథమ స్థానం సాధించి జిల్లా పోటీలకు ఎంపికైనట్లు మండల విద్యాధికారి రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిన్న నర్సయ్య, వ్యాయామ ఉపాధ్యాయురాలు ప్రీతి వెల్లడించారు. మంచిర్యాలలో జరిగిన పోటీలో బాలికలు ప్రథమ స్థానం సాధించగా వీరికి జిల్లా యువజన అధికారి హనుమంత రెడ్డి కప్ అందజేశారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు రోజీ వరకుమారి, రవి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
