Dandepally : అదివాసీల ర్యాలీ….
దండేపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా దండేపల్లి(Dandepally) మండలం మామిడిపల్లి గ్రామపంచాయతి పరిధిలోని దమ్మన్నపేట గ్రామంలోని నిరుపేద అదివాసీలకు(tribals) భూములు పంచాలని కోరుతూ ఈ రోజు దండేపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమపై పెట్టిన అక్రమ కేసులు(cases) వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తట్రా అర్జున్(Tatra Arjun), మహేష్, పొసవ్వ, లక్ష్మి, పద్మ, శిరీష, నర్సయ్య, వెంకటేష్, శంకర్, చిన్న నర్సయ్య, రాజ్ కుమార్, రమ్య తదితరులు పాల్గొన్నారు.

