Dandepally | ఘనంగా ఎల్లమ్మ తల్లి పట్నాలు

Dandepally | ఘనంగా ఎల్లమ్మ తల్లి పట్నాలు

Dandepally | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని నర్సాపూర్ ఎల్లమ్మ తల్లి పట్నాలను మంగళవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం కులస్తులందరు కలిసి పూజారుల ఆటపాటలతో అమ్మవారికి బోనాలు సమర్పించి పూజలు నిర్వహించారు.

గౌడ కులస్తులందరు ఒకే తాటి చెట్టు ఎక్కి చెట్టునుండి తాటి కల్లు తీసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి కోళ్లు, మేకలు బలిదానం చేసి అమ్మవారి కొలుపులు కొలిచారు. అనంతరం, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం కులస్తులు, నాయకులు పాల్గొన్నారు.

Dandepally |

Leave a Reply