Dandepalli | సెల్ ఫోన్‌ను బాధితురాలికి అప్పగింత…

Dandepalli | సెల్ ఫోన్‌ను బాధితురాలికి అప్పగింత…

Dandepalli | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని మేదరిపేట మార్కెట్‌లో రెబ్బనపల్లి గ్రామానికి చెందిన కృష్ణ పల్లి దేవక్క మేదరిపేట బస్టాండ్ వద్ద మక్క‌ కంకులు అమ్ముకునే క్రమంలో వివో ఫోన్ మార్కెట్లో పోయింది. పాతమామిడిపల్లి గ్రామానికి చెందిన తగరపు అంజయ్య అనే వ్యక్తికి ఆ ఫోన్ దొరికింది. అతను నిజాయితీగా దండేపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పడంతో వెంటనే డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ పెట్టం సత్తయ్య ఫోన్ పోగొట్టుకున్న కృష్ణపల్లి దేవక్కను పిలిపించి ఫోను అప్పగించారు. దొరికిన ఫోను నిజాయితీగా ఇచ్చిన తగరపు ఆంజయ్యను పోలీసులు అభినందించారు.

Leave a Reply