Dance art | కవితలలో పల్లవించి.. నాట్యంలో రవళిస్తోంది

Dance art | కృష్ణా బ్యూరో, ఆంధ్రప్రభ : పువ్వు పుట్టగానే పరిమళించిన చందాన…పండిత కుటుంబంలో పుట్టిన చివురు కొమ్మయినా… చేవ అయినట్లు…. చిన్నతనం నుంచే చిన్నారి శ్రీ సుహిత భారతి వచన కవితలు రాస్తోంది. తాతయ్య, అమ్మమ్మల కవితా వారసత్వాన్ని పుణికి పుచ్చుకోవటంతో పాటువారి ప్రోత్సాహంతో అదనంగా నాట్య కళలో తర్ఫీదు పొంది పలు వేదికలమీద ప్రదర్శిస్తూ ఆబాల గోపాలం చేత
ప్రశంసలు పొందుతోంది ఈ చిన్నారి. అవనిగడ్డలోని పండితాపురంకి చెందిన కవి పుంగవులు, విశ్రాంత ఉద్యోగులైన డాక్టర్ గుడి సేవ విష్ణు ప్రసాద్, కామేశ్వరీల కూతురు నర్మద. నర్మద ముద్దుల కుమార్తె శ్రీ సుహితా భారతి.
అవనిగడ్డలోనే తాతయ్య, అమ్మమ్మల చెంతనే ఉంటూ ఆరోతరగతి చదువుకుంటూ.. కవిత్వం, నాట్యంలో కళామతల్లి ముద్దు బిడ్డలా ఎదుగుతోంది. చిన్నతనం నుండి అమ్మమ్మ తాతయ్యల దగ్గర ఉండి అవనిగడ్డలోనే చదువుకుంటుంది. తాతయ్య కవి, అమ్మమ్మ తెలుగు రచయిత్రి కావటం చేత తాత అమ్మమ్మల వద్ద చిన్నతనం నుండి మన సాహితీ సాంప్రదాయాలకు తగిన శ్లోకాలను పద్యాలను పాటలను నేర్చుకుంటోంది. తరచుగా కవితలు రాస్తోంది.

నృత్య కళాకారిణి పిరాట్ల అర్చన వద్ద నృత్యం నేర్చుకుంటుంది.స్థానిక ప్రముఖ సంగీత విద్వాంసులు పాలపర్తి ఆంజనేయులు, ఆన్ లైన్ లో జల్లూరి స్వర్ణలత వద్ద సంగీతం కూడా అభ్యసిస్తోంది. లలిత కళలతో పాటు, అటు చదువులలోను చిన్నారి ముందంజలోనే ఉంటూ దివిసీమకు మంచి పేరును తెస్తోంది. డాన్స్ టీచర్ అర్చన నేతృత్వంలో శ్రీ సుహితా భారతి పలు చోట్ల ప్రదర్శనలు ఇచ్చింది. గత సంవత్సరం బాలల దినోత్సవం సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ బాలిక “బాలభారతి” అనే బాలల సంగీత, సాహిత్య,నృత్యపరిషత్ ను అవనిగడ్డలో మండలి బుద్ధ ప్రసాద్ హస్తముల మీదుగా ప్రారంభించింది.

ఆ సంస్థ ప్రారంభ కార్యక్రమంగా తాతయ్య విష్ణు ప్రసాద్ రూపొందించిన “భారతీ విజయం”అనే సంగీత రూపకంలో తాను సరస్వతిగా, స్నేహితురాళ్ళు వివిధ ప్రాచీన కవయిత్రులుగా డాన్స్ టీచర్ అర్చన నృత్య సహకారంతో మంచి ప్రదర్శనను ఇచ్చి బుద్ధ ప్రసాద్, తదితర పెద్దల చేత మన్ననలను అందుకుంది. అందులో సహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ ఆశువుగా చెప్పిన “అమ్మను నమ్ముకొంటి”అనే చంపకమాలికను కంఠస్థం చేసి అద్భుతంగా ప్రదర్శన ఇచ్చింది. అవనిగడ్డలో అచ్చ తెలుగు అవధాని డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ స్థాపించిన “తెలుగు సావిడి”సాహిత్య సంగీత కార్యక్రమాలలో హాజరవుతూ తాను నేర్చుకున్న పద్యాలను అలవోకగా ఆలపిస్తూ ప్రేక్షకుల హృదయాలను రంజింప చేస్తూ పలు బహుమతులను అందుకుంది.

ఈ సంవత్సరం ప్రపంచ స్థాయిలో జరిగిన భాగవత పద్యాల పోటీలలో రాష్ట్ర స్థాయిలో బహుమతి సాధించి పలు వర్గాల మనసులను గెలుచుకొంది. ఇటీవల విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో రామరాజభూషణుడు రచించిన వసంత వర్ణన “లలనా జనాపాంగ”అనే సీస పద్యాన్ని మధురంగా ఆలపించగా గజల్ శ్రీనివాస్ ప్రశంసించి సన్మానించారు. ఇటీవల అవనిగడ్డలో విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనంలో తాను రాసిన కవితను నిర్భయంగా ఆలపించి పెద్దన్నల మన్ననలను అందుకుంది. ఆకాశవాణి నిర్వహకులుచే ప్రశంసలు అందుకుంది. కవి సమ్మేళనంలో శ్రీ సుహిత భారతి చదివిన ఉగాది కవిత యిది.

“వచ్చింది వచ్చింది ఉగాది
నవ వసంతం తెచ్చింది ఉగాది
ఆనందాన్ని ఇచ్చింది ఉగాది
అనుబంధాలను నింపింది ఉగాది
షడ్రుచుల కలయికే ఉగాది
కోయిల పాట వినిపించింది ఉగాది
పంచాంగ శ్రవణమే మన ఉగాది
కవి సమ్మేళనాల కలయికే ఉగాది
తెలుగు సంవత్సర ఆరంభమే ఉగాది
నవ కాంతులను నింపేది మన ఉగాది
వచ్చింది వచ్చింది ఉగాది
వసంతాన్ని తెచ్చింది ఉగాది.

కొత్త బెల్లం తీపి – అనురాగాలు
వేప పూత చేదు -అనుభవాలు
కొత్త మిరప కారం -కోపతాపాలు
కొత్త చింతకాయ పులుపు – కోరికలు
సూర్యుడిచ్చే ఉప్పు – కొత్త రుచులు
మామిడి పిందే వగరుల -కలయిక మన ఉగాది
నవవసంతం తెచ్చిన ఉగాది
ఆనందానికి ఆది ఉగాది.
వచ్చింది వచ్చింది ఉగాది
వసంతాన్ని తెచ్చింది ఉగాది” అంటూ చిన్నారి చిరుత కోయిలలా కవితను చదివి …అందరి హృదయాలను ముద్దుగా దోచుకుంది. లలిత కళలతో లీనమై చదువు తున్న ఈ చిన్నారికి.. తెలుగుభాష పట్ల మమకారం ఎక్కువ. తన ఈడు పిల్లలు ఆంగ్ల పదాలతో కలిపి మాట్లాడుతుంటే.. భారతి మాత్రం తెలుగుభాషలోనే గలగల మాట్లాడుతుంది. తేనెలూరు తెలుగుభాషకు అభ్యాసంతో తీపి అద్దుతోంది. నాట్యంలో కూడా రాణిస్తూ.. రెండింటిలోను సవ్యసాచిలా ఎదుగుతోంది. అన్ని కళలలో రాణిస్తున్న ఈ చిన్నారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అందరం ఆశిద్దాం…!