Cyber War Break : ఇజ్రాయెల్​ ను వదలం Andhra Prabha News

Cyber War Break : ఇజ్రాయెల్​ ను వదలం Andhra Prabha News

  • సైబర్ వార్‌కు నో బ్రేక్​
  • అమెరికాపై దాడులు ఆపేశాం
  • ఇరాన్ హ్యాకర్లు హంబాలా సంచలన ప్రకటన

’ఆంధ్రన్రభ, ఫ్యారిస్​ ప్రతినిధి )

Cyber War Break

Cyber War Break : అమెరికాపై ఇరాన్ జరిపిన అత్యంత కీలక సైబర్ దాడులకు తామే బాధ్యులమని కాల్పుల విరమణ నేపథ్యంలో సైబర్​ అటాక్స్​ నిలిపివేస్తున్నట్లు హ్యాకర్ల బృందం, తెలిపింది. ఎఫ్‌బీఐ సమాచారం ప్రకారం, హండాలా అనే ఈ బృందం ఇరాన్ గూఢచార భద్రతా మంత్రిత్వ శాఖకు ఒక ముసుగు సంస్థగా పనిచేస్తోందని భావిస్తున్నారు. ఈ బృందం కార్యకలాపాలను “సైకో యాక్తివిటీస్​ గా “గా ఎఫ్‌బీఐ అభివర్ణించింది.

Cyber War Break : హండాలా నిర్వాహకులు తమ టెలిగ్రామ్ ఛానెల్‌లో, కాల్పుల విరమణకు ప్రతిస్పందనగా, అమెరికాపై తాము జరిపిన హ్యాక్‌ల గురించి ప్రచారం నిలిపి వేయాలని ఇరాన్ ఉన్నతాధికారులు ఆదేశించినట్లు గురువారం తెలిపారు.

Cyber War Break

Cyber War Break : “ప్రతిఘటన యాక్సిస్​ అత్యున్నత నాయకత్వం ఆదేశాల ప్రకారం, ప్రస్తుతం అమెరికాతో బహిరంగ ఘర్షణను వాయిదా వేశాం, కానీ అమెరికా మౌలిక సదుపాయాల మూలాల్లోకి చొచ్చుకెళ్లి దెబ్బకొట్టే మా సామర్థ్యం ప్రపంచానికి ఇప్పటికే తెలుసు,” అని అది పేర్కొంది.

Cyber War Break : ఇజ్రాయెల్​ ని వీడం

Cyber War Break

ఇజ్రాయెల్‌తో సహా ఇతర లక్ష్యాలపై హ్యాకింగ్ కొనసాగిస్తామని ఆ బృందం స్పష్టం చేసింది. ” సైనిక ఘర్షణతో సైబర్ యుద్ధం ప్రారంభం కాలేదు, ఏ సైనిక కాల్పుల విరమణతోనూ అది ముగియదు,” అని అది పేర్కొంది. “హండాలా, పూర్తి స్థాయిలో, జియోనిస్ట్ పాలన మౌలిక సదుపాయాలపై తన సైబర్ కార్యకలాపాలను కొనసాగిస్తోంది.

ALSO READ : 26 South Korea Ships : సాహో.. ఇరాన్ Andhra Prabha News

Leave a Reply