Cyber ​​crimes | మహిళలు, బాలల రక్షణకు పోలీసుల ప్రత్యేక చర్యలు

Cyber ​​crimes | మహిళలు, బాలల రక్షణకు పోలీసుల ప్రత్యేక చర్యలు

సైబర్ నేరాలు – రహదారి, ఎంభద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు

Cyber ​​crimes | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లాలో మహిళలు, బాలల రక్షణతో పాటు సైబర్ నేరాల నివారణ, రహదారి భద్రత, పోలీస్ సేవలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని పాఠశాలలు, పట్టణాలు, గ్రామాలలో సీఐలు, ఎస్సైలు, జీఎంఎస్కేలు సంయుక్తంగా విస్తృత స్థాయిలో అవగాహన సమావేశాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమాలలో మహిళలపై జరుగుతున్న నేరాలు, బాల్య వివాహాల నిరోధం, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ పై అవగాహన, ఈవ్ టీజింగ్ నియంత్రణ, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, ట్రాఫిక్ నిబంధనలు, పోలీస్ సేవల గురించి ప్రజలకు వివరణ ఇచ్చారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదని, వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదని సూచించారు.

Cyber ​​crimes |

రహదారులపై ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఏవైనా అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112, డయల్ 100, 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని వివరించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం అత్యంత కీలకమని అధికారులు తెలిపారు.

Leave a Reply