ఫిషింగ్ అనేది ఒక సోషల్ ఇంజనీరింగ్ స్కామ్, దీనికి పాల్పడే మోసగాళ్లు మీకు సంబంధించిన సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని మీరే బయట పెట్టేలా చేస్తారు లేదా మాల్వేర్‌ను మీ పరికరంలో డౌన్‌లోడ్ చేయడానికి దారితీసే హానికరమైన లింక్‌లను మీరే క్లిక్ చేసేలా మోసం చేస్తారు. ఫిషర్లు (ఫిషింగ్‌కు పాల్పడే మోసగాళ్లు) సాధారణంగా మీ బ్యాంక్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లేదా ప్రభుత్వ సంస్థ వంటి చట్టబద్ధమైన సంస్థలు పంపించాయని అనిపించేలా, వాటిని పోలి ఉండే మోసపూరిత ఇమెయిల్‌లను ఉపయోగిస్తారు.
అత్యవసరంగా ఆ మెయిల్‌ను చూడమని, వాటిలోని లింక్‌ను క్లిక్ చేయమని, అటాచ్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేయమని లేదా పాస్‌వర్డ్‌లు, డెబిట్ / క్రెడిట్ కార్డ్ నంబర్లు లేదా ఆధార్ క్రెడెన్షియల్స్ వంటి వ్యక్తిగత వివరాలను పంపమని మీలో కంగారు కలిగేలా చేయడమే ఆ మెయిల్ ముఖ్య ఉద్దేశం. ఫిషింగ్ దాడులు తరచుగా జరుగుతున్నాయి,
ఇమెయిల్‌లు, టెక్స్ట్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ ద్వారా భారతీయులే లక్ష్యంగా ఫిషర్లు దాడి చేస్తున్నారు. భారతదేశంలో డిజిటల్ సర్వీస్‌లను పొందడానికి ఎక్కువ మంది మొబైల్ పరికరాలనే ప్రధానంగా ఉపయోగిస్తున్నారు, అందుకే భారతదేశమే ఈ మోసాలకు ప్రధాన లక్ష్యంగా మారింది.ఫిషింగ్ ఇమెయిల్‌లను గుర్తించడం కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి, మీకు సంబంధించిన వివరాలు లేని, సాధారణ కంటెంట్ ఉన్న మెసేజ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండండి, అక్షరదోషాలు లేదా అసాధారణ అక్షరాలు ఉన్న మెసేజ్‌లు/మెయిల్‌లను పంపిన వారి మెయిల్ అడ్రస్‌ను జాగ్రత్తగా చెక్ చేయండి, వెంటనే స్పందించాలని మిమ్మల్ని ఒత్తిడి చేసే అత్యవసర కాల్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి.
అలానే, చట్టబద్ధమైన సంస్థలు ఇమెయిల్ ద్వారా సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని అరుదుగా అభ్యర్థిస్తాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి, మెయిల్‌లో వ్యాకరణ, అక్షర దోషాలు ఉంటే, అది ఫిషింగ్ దాడికి మోసగాళ్లు ప్రయత్నిస్తున్నారనడానికి బలమైన సూచిక అని తెలుసుకోండి. ఫిషింగ్‌ను తప్పించుకోవడం కోసం, అనూహ్యమైన ఇమెయిల్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి, విశ్వసనీయమైన సోర్స్‌ల నుండి వచ్చిన మెయిల్‌గా అనిపించినప్పటికీ, దానిలో ఉన్న లింక్‌లపై క్లిక్ చేయకండి,
దీనికి బదులుగా మీ బ్రౌజర్‌లో ఆ వెబ్‌సైట్ అడ్రస్‌ను మాన్యువల్‌గా టైప్ చేసి చెక్ చేయండి; తెలిసిన మార్గాల (కాంటాక్ట్ నంబర్ లేదా మెయిల్) ద్వారా సంస్థలను నేరుగా సంప్రదించి, మీకు మెయిల్ పంపినవారి వివరాలను వెరిఫై చేయండి, అలానే మీ సాఫ్ట్‌వేర్ మెరుగ్గా ఫిషింగ్‌ను గుర్తించేలా యాంటీవైరస్, వెబ్ బ్రౌజర్‌లను నిరంతరం అప్‌డేట్ చేస్తూ ఉండండి. SMS లేదా వాయిస్ వంటి పలు మార్గాల ద్వారా ఫిషింగ్ జరగవచ్చు.
SMS ఫిషింగ్, దీన్ని స్మిషింగ్ అని కూడా పిలుస్తారు, ఈ రకమైన మోసంలో స్కామర్లు బాధితులను బురిడీ కొట్టించడం కోసం టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా హానికరమైన లింక్‌లను పంపి, వాటిని బాధితులే క్లిక్ చేసేలా లేదా వ్యక్తిగత సమాచారాన్ని బాధితులే స్వయంగా వెల్లడించేలా పన్నాగాలు పన్నుతారు. వారు డెలివరీ సర్వీస్‌లకు చెందిన వాళ్లమని, బ్యాంక్ తరఫున మాట్లాడుతున్నామని నటించవచ్చు లేదా మీరు బహుమతి గెలుచుకున్నారని కూడా అబద్ధాలు చెప్పవచ్చు. స్మిషింగ్ స్కామ్‌లో తరచుగా ప్యాకేజీ డెలివరీ అడ్రస్‌ను నిర్ధారించాలని నమ్మబలుకుతూ నకిలీ ప్యాకేజీ డెలివరీ నోటిఫికేషన్లు పంపడం, అకౌంట్ వెరిఫికేషన్ ముసుగులో మోసపూరిత ఉద్దేశంతో OTPలు లేదా వ్యక్తిగత డేటాను అభ్యర్థించడం, అలానే పోటీలో గెలిచారని లేదా బహుమతిని పొందారని అబద్ధాలు చెప్పి, అసలు ఉనికిలోనే లేని రివార్డులను క్లెయిమ్ చేసుకోండి అంటూ బాధితులను ప్రేరేపించడం వంటివి జరుగుతాయి.
వాయిస్ ఫిషింగ్, దీన్ని విషింగ్ అని కూడా పిలుస్తారు, ఇది ఇంకో రకమైన స్కామ్, దీనిలో నేరస్థులు బాధితులకు ఫోన్ చేసి, వారిని మోసగించి రహస్య సమాచారాన్ని బయటపెట్టేలా చేస్తారు. మోసగాళ్లు తరచుగా టెక్నికల్ సహాయం అందిస్తామని నమ్మిస్తారు, ప్రభుత్వ సంస్థ ప్రతినిధులు లేదా కష్టాల్లో ఉన్న కుటుంబ సభ్యుల వలె నటిస్తారు. మీ వ్యక్తిగత సమాచారం లేదా ఆర్థిక వివరాలను తెలిపేలా మిమ్మల్ని మోసగించడం కోసం సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాలను వాళ్లు ఉపయోగిస్తారు.
చట్టబద్ధమైన సోర్స్‌ల నుండి కాల్ చేస్తున్నామని నమ్మించి, మోసగించడం కోసం కాలర్ ఐడి స్పూఫింగ్‌ను వాడటం, హ్యాక్‌కు గురైన అకౌంట్లు లేదా పే చేయాల్సిన పన్నులను క్లెయిమ్ చేయాలని చెబుతూ, తప్పకుండా స్పందించాల్సిన అవసరాన్ని కల్పించేలా భావోద్వేగాన్ని నియంత్రించే వ్యూహాలు అమలు చేయడం, అలానే గుర్తింపు వెరిఫికేషన్ పేరుతో పాస్‌వర్డ్‌లు, పిన్‌లు లేదా OTPలు వంటి సున్నితమైన సమాచారాన్ని బయట పెట్టే విధంగా వ్యక్తులను మోసగించడం వంటి సోషల్ ఇంజనీరింగ్ పద్ధతులు ఈ విషింగ్ స్కామ్‌లలో ఉంటాయి.
మీరు ఫిషింగ్ స్కామ్‌ల బారిన పడకుండా మిమ్మల్ని రక్షించుకోవడం కోసం ఫోన్‌పే సైబర్ భద్రతా నిపుణులు కొన్ని కీలకమైన చిట్కాలను తెలిపారు.స్మిషింగ్‌ను నివారించడం కోసం అనుమానాస్పద టెక్స్ట్ మెసేజ్‌ల్లోని లింక్‌లను క్లిక్ చేయకండి, తెలిసిన నంబర్ల నుండి వచ్చినట్లుగా అనిపించే లింక్‌లను కూడా క్లిక్ చేయకండి, టెక్స్ట్ మెసేజ్‌లకు రిప్లై ఇచ్చేటప్పుడు వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ పంపకండి, ఎందుకంటే చట్టబద్ధమైన సంస్థలు SMS ద్వారా సున్నితమైన డేటాను అభ్యర్థించవు,
అలానే స్మిషింగ్ మోసాల బారిన పడకుండా నియంత్రించడం కోసం అనుమానాస్పద నంబర్లను ముందుగానే బ్లాక్ చేయండి. విషింగ్ స్కామ్‌లను తప్పించుకోవడం కోసం, ఫోన్ ద్వారా బ్యాంకింగ్ వివరాలు లేదా OTPలను ఎప్పుడూ ఎవరికీ చెప్పకండి, ముఖ్యంగా ఆర్థిక సంస్థల తరఫున మాట్లాడుతున్నానంటూ చెప్పుకునే గుర్తింపు లేని కాలర్లు మీకు ఫోన్ చేసినప్పుడు, అలానే ఆ కాల్ చట్టబద్ధత గురించి మీకు అనుమానం వచ్చినప్పుడు, వెంటనే ఫోన్ కట్ చేసి, ఆ సంస్థ అధికారిక కస్టమర్ సర్వీస్ నంబర్‌కు కాల్ చేసి, నేరుగా సంస్థను సంప్రదించండి.మోసం చేసే పద్ధతులు వేర్వేరుగా ఉన్నప్పటికీ, ఫిషింగ్, స్మిషింగ్, విషింగ్ అన్నీ కూడా భావోద్వేగాల నియంత్రణపైనే ఆధారపడి ఉంటాయి.
అవి మన నమ్మకాన్ని, భయాన్ని లేదా అత్యుత్సాహాన్ని ఉపయోగించుకుని, మన ప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా మనమే ప్రవర్తించేలా మోసగిస్తాయి. ఈ స్కామ్‌లు ఎలా జరుగుతాయో అర్థం చేసుకోవడం ద్వారా, అలానే సురక్షితమైన ఆన్‌లైన్ అలవాట్లను పాటించడం ద్వారా, మీరు బాధితులయ్యే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. స్కామ్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి, అప్రమత్తంగా ఉండండి, అలానే స్కామ్‌ల బారిన పడకండి!
ఫోన్‌పేలో మీరు అలాంటి స్కామ్‌కు గురైతే, వెంటనే ఫోన్‌పే యాప్ ద్వారా లేదా కస్టమర్ కేర్ నంబర్ 080–68727374 / 022–68727374కు కాల్ చేసి లేదా ఫోన్‌పే అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌కు సమాచారమిచ్చి, ఆ స్కామ్‌ల గురించి తెలపవచ్చు. చివరగా, మీరు సమీపంలోని సైబర్ క్రైమ్ సెల్‌లో మోసం గురించి ఫిర్యాదు చేయవచ్చు లేదా https://www.cybercrime.gov.in/కు వెళ్లి, ఆన్‌లైన్‌లో ఫిర్యాదును రిజిస్టర్ చేయవచ్చు లేదా 1930కు కాల్ చేసి సైబర్ క్రైమ్ సెల్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.