Cyber ​​Crime | నేర నియంత్రణలో మార్పు

Cyber ​​Crime | నేర నియంత్రణలో మార్పు

  • 2025లో 0.7 శాతం క్రైమ్ రేటు పెరుగుదల.
  • కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

Cyber ​​Crime | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా వ్యాప్తంగా 2024–2025 సంవత్సరాల నేర గణాంకాలను పోల్చి పరిశీలిస్తే మొత్తం నేరాల సంఖ్యలో స్వల్ప పెరుగుదల కనిపించినప్పటికీ తీవ్రమైన నేరాలు, మహిళలపై నేరాలు, సైబర్ నేరాలు(Cyber ​​Crime), హత్యలు వంటి కీలక విభాగాల్లో గణనీయమైన తగ్గుదల నమోదైనట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్(SP Vikrant Patil) వెల్లడించారు.

ఈ రోజు స్థానిక కేస్ వ్యాస్ ఆడిటోరియంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సమర్థవంతమైన పోలీసింగ్, సాంకేతిక వినియోగం, ప్రజల భాగస్వామ్యంతో నేర నియంత్రణలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నదని అధికారులు పేర్కొన్నారు.

మొత్తం నేరాల పరిస్థితి

2024 సంవత్సరంలో జిల్లాలో మొత్తం 4022 కేసులు నమోదు కాగా, 2025 సంవత్సరంలో 4051 కేసులు నమోదయ్యాయి. దీనివల్ల మొత్తం నేరాల్లో 0.7 శాతం స్వల్ప పెరుగుదల కనిపించింది. అయితే ఈ పెరుగుదల ప్రధానంగా చిన్నపాటి కేసుల కారణంగా ఉండగా, తీవ్రమైన నేరాల్లో తగ్గుదల కనిపించడం గమనార్హం.

Leave a Reply