కరెంట్ షాక్.. వ్యక్తి మృతి

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో (Andhra Pradesh and Telangana states) వానలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా చోట్ల విద్యుత్ తీగలు (Electrical wires) తెగిపడే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. కరెంట్‌తో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్షం కురిసే సమయంలో విద్యుత్ స్తంభాలు, వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల (poles, wires, transformers) వద్దక వెళ్లకపోవడమే మంచిది. ప్రజలు అజాగ్రత్తతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. చిన్న చిన్న తప్పులే ప్రాణాలు తీస్తున్నాయి. పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు, ఎలక్ట్రిక్ బాక్స్‌ల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. వాటికి తాకడం, వాటి సమీపంలో ఏ పనైనా చేయడం అత్యంత ప్రమాదకరం. వర్షాలు పడుతున్న సమయంలో, రోడ్లపై నీరు నిలిచిన చోట వెళ్లాల్సి వస్తే ఆచి తూచి అడుగువేయండి. అనవసరంగా రోడ్లపై దేనిని ముట్టుకోవద్దు. విద్యుత్ ప్రమాదాలను తక్కువ అంచనా వేయకూడదు. చిన్న అజాగ్రత్తే పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు.
రామంతాపూర్ ఘటన మరువక ముందే..
హైదరాబాద్ రామంతాపూర్ (Hyderabad Ramantapur)లో కరెంట్ షాక్ తో ఏడుగురు మరణించిన ఘటన తర్వాత, తాజాగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో మరో విషాద ఘటన(Suryapet Electric Shock Incident) చోటుచేసుకుంది. సూర్యాపేట పట్టణంలోని వాణిజ్య భవన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా నివసిస్తున్న దంతాల చక్రధర్ (50) అనే వ్యక్తి అక్కడే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర మూత్ర విసర్జన కోసం వెళ్లారు. అయితే అనుకోని విధంగా ట్రాన్స్‌ఫార్మర్ నుంచి విద్యుత్ షాక్ (Electric Shock from Transformer) తగిలి, ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం కోసం పంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పూర్తి వివరాలు తెలుసుకునే దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
