Cultivation | వరి సాగు ఆధునిక పద్ధతులపై అవగాహన..

Cultivation | వరి సాగు ఆధునిక పద్ధతులపై అవగాహన..
Cultivation | వేల్పూర్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో గ్రామ అభివృద్ధి భవనంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రైనర్ ప్రేమలత రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఏరియా మేనేజర్ మమత మాట్లాడుతూ… తడి-పొడి విధానం ద్వారా యాజమాన్యం, నేరుగా వరి విత్తడం, భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం వంటి పద్ధతులను వివరించారు.
నూతన సాగు పద్ధతులను అనుసరించడం వలన పెట్టుబడి తగ్గడమే కాకుండా, కూలీల ఖర్చు సుమారు ఎనిమిది వేల రూపాయల వరకూ ఆదా అవుతుందని, సాగు సమయం తగ్గిపోతుందని పేర్కొన్నారు. అలాగే నీటి వినియోగాన్ని నియంత్రించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, చీడపీడల నివారణ సులభతరం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలోసర్పంచ్ నల్ల రాజు, ఉప సర్పంచ్ గైని నరేందర్, కమ్యూనిటీ ఫెసిలిటీటర్ రాజేష్, ప్రశాంత్,ఏఈఓ సాయిరాం, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి, రైతులు గంగాధర్, శబరిష్,లీడ్ ఫార్మర్స్ పాల్గొన్నారు..
