Cuddapah | దమ్ముంటే ఆ నాలుగు స్థానాల్లో ఉపఎన్నికకు రండి. కూట‌మికి వైసిపి స‌వాల్

క‌డ‌ప – సూపర్ సిక్స్ పథకాలపై రెఫరండంగా కుప్పం, మంగళగిరి, పిఠాపురం ఉపఎన్నికలకు వెళ్లే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి. కాకమ్మ కబుర్లు దద్దమ్మ మాటలు మాట్లాడితే సరిపోతుందా దమ్ముంటే కుప్పం, మంగళగిరి, పిఠాపురం, పులివెందుల ఉప ఎన్నికలకు రావాలి అంటూ సవాల్ విసిరారు. క‌డ‌ప‌లో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ అధినేత జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలో చంద్రబాబుకు సినిమా చూపిస్తాడని భయం అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తే సమయం ఉంటుందని… ప్రజల పక్షాన మాట్లాడే వీలు కలుగుతుందన్నారు. జగన్ అడిగే ప్రశ్నలకు సమాధానం లేక ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదంటూ విమర్శలు గుప్పించారు. జగన్ ఉప ఎన్నికలకు భయపడుతున్నారు అంటున్నారని అంత కూటమి గాలిలో కూడా ఆయ‌న‌ 65 వేలపై చిలుకు ఓట్లతో గెలు పొందారని చెప్పారు.

Leave a Reply