CSK vs RCB | చెన్నై వేదిక‌గా బిగ్ ఫైట్.. సిఎస్కే తో ఆర్సీ ఢీ !

  • టాస్ గెలిచిన సీఎస్కే
  • తొలి బ్యాటింగ్ ఆర్సీబీదే

చెన్నై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా నేడు మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య బిగ్ అండ్ టఫ్ ఫైట్ జరగనుంది. ఈ రెండూ మేటీ జట్లు కావడంతో ఏ టీమ్ గెలుస్తుందో క్రికెట్ అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

కాగా, ఈ ఉత్కంఠ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూప‌ర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేప‌ట్ట‌నుంది.

తుది జ‌ట్ల వివ‌రాలు :

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజ్‌లేవుడ్, యశ్ దయాళ్.

చెన్నై సూపర్ కింగ్స్ : రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), దీపక్ హుడా, శామ్ కర్రాన్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీప‌ర్), ఆర్ అశ్విన్, నూర్ అహ్మద్, మతీషా పతిరానా, ఖలీల్ అహ్మద్.

ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్స్ జాబితా: సుయాష్ శర్మ, రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్.

సీఎస్కే ఇంపాక్ట్ ప్లేయర్స్ జాబితా: శివమ్ దూబే, కమలేష్ నాగర్కోటి, విజయ్ శంకర్, జామీ ఓవర్టన్, షేక్ రషీద్.

ఎన్ని సార్లు తలపడ్డాయి.. ఎవరిది పైచేయి?

ఇప్పటికే ఈ సీజన్‌ను సీఎస్కే, ఆర్సీబీ విజయాలతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జోరును కొనసాగించాలని ఇరు జట్లూ పట్టుదలతో ఉన్నాయి. అయితే చెన్నై వర్సెస్ ఆర్సీబీ ఇప్పటివరకు 33 సార్లు తలపడ్డాయి. ఇందులో చెన్నై జట్టే ఎక్కువ సార్లు పైచేయి సాధించింది. ఏకంగా 21 మ్యాచుల్లో ఆర్సిబీని ఓడించింది. ఇక చెన్నైపై కేవలం 11 మ్యాచుల్లోనే విజయం సాధించింది ఆర్సీబీ. ఒకే ఒక్క మ్యాచ్ ఫలితం తేలలేదు

వరుసగా 17 ఏళ్లుగా..

ఇప్పటివరకు ఐపీఎల్ 17 సీజన్లను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 18వ సీజన్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఇప్పుడు సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మధ్య చెన్నై చెపాక్ వేదికగా జరగనుంది. అయితే చెన్నై గడ్డపై 17 ఏళ్ల నుంచి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా విజయం సాధించలేదు.

ఆర్సీబీ చివరిసారిగా 2008 ఐపీఎల్‌ ప్రారంభ ఎడిషన్‌లో చెపాక్ గడ్డపై చెన్నైపై గెలిచింది. ఆ తర్వాత మళ్లీ గెలవనేలేదు. అందుకే ఈ సీజన్ లోనైనా చెపాక్ గడ్డపై ఆర్సీబీ గెలుస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అందుకే అభిమానులు మరింత ఉత్కంఠతో సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచు కోసం ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *