ఐపీఎల్ 2025 సీజన్‌లో మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతన్నాయి. కాగా, ఈరోజు (బుధవారం) చెపాక్ మైదానంలో పంజాబ్ కింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో సొంత గడ్డపై చెన్నై జట్టు ముందుగా బ్యాటింగ్ చేపట్టనుంది.
తుది జట్లు :
పంజాబ్ కింగ్స్ : ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (WK), శ్రేయాస్ అయ్యర్ (c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, సూర్యాంశ్ షెడ్జ్.
చెన్నై సూపర్ కింగ్స్ : షేక్ రషీద్, ఆయుష్ మ్హత్రే, సామ్ కర్రాన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రీవిస్, శివమ్ దూబే, దీపక్ హుడా, ఎంఎస్ ధోని (సి), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానా.
జట్టు మార్పులు:
పంజాబ్ కింగ్స్: ప్రభ్ సిమ్రాన్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్ స్థానంలో హర్ప్రీత్ బ్రార్, సూర్యాన్ష్ షెడ్జ్ తుది జట్టులోకి వచ్చారు.
ఇంపాక్ట్ ప్లేయర్స్ :
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ముషీర్ అహ్మద్ ఖాన్, వైషాక్ విజయ్‌కుమార్, ప్రవీణ్ దూబే, జేవియర్ బార్ట్‌లెట్.
చెన్నై సూపర్ కింగ్స్: జామీ ఓవర్టన్, రవిచంద్రన్ అశ్విన్, అన్షుల్ కాంబోజ్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్.
ఓడిపోతే ఎలిమినేషన్..
ఈ సీజన్ లో అత్యంత పేవలమైన ప్రదర్శన కనబరుస్తున్న చెన్నై.. ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడి రెండు మ్యాచ్‌ల్లోనే గెలిచింది. మరో 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో 4 పాయింట్లతో (-1.302) అట్టడుగున నిలిచింది. ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కు బలమైన కోటగా ఉన్న చేపాక్ ను.. ఈ సీజన్ లో నాలుగు జట్లు బద్దలు కొట్టాయి. అయితే, ఇదే ట్రెండ్ కొనసాగి నేటి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ గెలిస్తే, సీఎస్కే అధికారికంగా ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది.
గెలిస్తే టాప్ ఫోర్లోకి !
ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే.. ఆ జట్టుకు మళ్ళీ టాప్ ఫోర్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆ జట్టు 9 మ్యాచ్‌లు ఆడగా 5 మ్యాచల్లో గెలుపొందింది. మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఆ జట్టు ఖాతాలో 11 పాయింట్లు (+0.177) ఉన్నాయి. ప్రస్తుత్తం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న పంజాబ్.. చెన్నైపై విజయం సాదిస్తే.. టాప్-4లోకి దూసుకువెలుతుంది.