చెన్నై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో నేడు జరుగుతున్న మ్యాచ్ లో 200 స్కోర్ చేయకుండా ఢిల్లీ క్యాపిటల్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ అడ్డుకుంది. నిర్ధారిత 20 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.. చెన్నై సూపర్ కింగ్స్ గెలవాలంటే 184 పరుగులు చేయాల్సి ఉంది. ఇక ఈ మ్యాచ్ లో . చెపాక్ స్టేడియంలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్(77) దంచికొట్టాడు. యువకెరటం అభిషేక్ పొరెల్(33), కెప్టెన్ అక్షర్ పటేల్(21)లు మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. వీళ్లిద్దరూ త్వరగానే వెనుదిరిగినా మిడిల్ ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను రాహుల్ బెంబేలెత్తించాడు. ఇక ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (24) ధనాధన్ ఆడాడు. వీళ్లిద్దరి మెరుపులతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఇక కె ఎల్ రాహుల్ 77 , పోరెల్ 33, అక్షర్ పటేల్ 21, సమీర్ రిజ్వి 20 , స్టబ్స్ 24 పరుగులు చేసి ఔటయ్యారు.. చెన్నై బౌలర్ల లో ఖలీల్ రెండు వికెట్లు సాధించగా, నూర్, జడేజా,పతిరానాకు ఒక్కో వికెట్ దక్కింది.
CSK vs DC |ముగిసిన ఢిల్లీ ఇన్నింగ్స్ – చెన్నై టార్గెట్ ఎంతంటే
