CSI Church | ఏసుక్రీస్తు బోధనలు మానవళికి ఆదర్శం

CSI Church | ఏసుక్రీస్తు బోధనలు మానవళికి ఆదర్శం
CSI Church | కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : ఏసుక్రీస్తు బోధనలు మానవళికి ఆదర్శమని లింగాపూర్ గ్రామ సర్పంచ్ కుమ్మరి రంజిత్ కుమార్ అన్నారు. ఈ రోజు క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని మండలంలోని లింగాపూర్ గ్రామంలో గల సిఎస్ఐ చర్చి(CSI Church)లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి పాస్టర్ హానకు రాజ్ క్రిస్మస్(Raj Christmas) సందేశాన్ని అందించారు.
ప్రతి ఒక్కరు ప్రేమ కరుణ శాంతి దయాగుణంతో ఇతరుల పట్ల మెలగాలని ప్రేమను పంచాలని క్రీస్తు సందేశాన్ని తెలియజేశారు. ఇట్టి ఆరాధన కార్యక్రమానికి నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ సర్పంచ్ కుమ్మరి రంజిత్ కుమార్ వార్డ్ మెంబర్స్ మాజీ సర్పంచ్ ఆకుల బాలవ్వ లచ్చన్నకు వివిధ పార్టీ నాయకులు(Party Leaders) హాజరు కాగా వారికి చర్చి సభ్యులు శాలువాలు కప్పి సన్మానించారు.
లింగాపూర్ గ్రామ సర్పంచ్ కుమ్మరి రంజిత్ కుమార్ కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు. అదేవిధంగా నూతన సంవత్సర క్యాలెండర్ సర్పంచ్ ఆవిష్కరించారు. సంఘ పెద్దలు నేదూరి జాకబ్ ఆరెల్లి సురేష్, సుమన్, రాజన్న, రాజమల్లు ఇతర సంఘ పెద్దలు పాల్గొన్నారు.
