Crude Oil |ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం.. జెట్ స్పీడ్ లో పెరిగిన అయిల్ ధ‌ర‌లు

న్యూ ఢిల్లీ – ఇజ్రాయెల్, ఇరాన్ (Iran vs Israel ) మధ్య కొన‌సాగుతున్న‌ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లలో (Oil market ) తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. అంతర్జాతీయంగా ముడిచమురు (Crude Oil ) ధరలు (Rates ) నేడు ఒక్కసారిగా పెరిగాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా భద్రతపై తీవ్ర ఆందోళనలకు దారితీసింది.

మార్కెట్ విశ్లేషకుల సమాచారం ప్రకారం, ఈ దాడి వార్త వెలువడిన కొన్ని గంటల్లోనే బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ ధరలు 4 శాతానికి పైగా పెరిగాయి. ఈ ధరలు 2024 ప్రారంభంలో నమోదైన గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని నిపుణులు తెలిపారు. ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారులలో ఒకటి కావడం, ప్రపంచంలోని ఐదో వంతు చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి ఈ ప్రాంతంలో ఉండటంతో ఇక్కడ జరిగే ప్రతి పరిణామాన్ని వ్యాపారులు, విధాన రూపకర్తలు నిశితంగా గమనిస్తున్నారు.

ఈ ఆకస్మిక ధరల పెరుగుదల నేపథ్యంలో అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) (IEA) సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. అవసరమైతే మార్కెట్‌ను స్థిరీకరించడానికి సభ్య దేశాలు తమ వ్యూహాత్మక నిల్వలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయని ఐఈఏ ఒక ప్రకటనలో తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *