Cross Road | వ్యక్తి దుర్మరణం…

Cross Road | వ్యక్తి దుర్మరణం…

మ‌రో ఇద్ద‌రికి గాయాలు…

Cross Road | మైలవరం, ఆంధ్రప్రభ : మైలవరం, తిరువూరు ప్రధాన రహదారి తైదుపాడు క్రాస్ రోడ్ వద్ద కారు ఢీకొని చాట్ల వెంకటేశ్వరరావు (69) దుర్మ‌ర‌ణం పాలైన సంఘటన ఇది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పంచాయతీ తైదుపాడు(సబ్జపాడు)గ్రామానికి చెందిన మృతుడు చాట్ల వెంకటేశ్వరరావు మైలవరం నూజివీడు రోడ్డులోని సిటీ యూనియన్ బ్యాంకు ఏటిఎంలో సెక్యూరిటీ గార్దుగా పనిచేస్తున్నాడు.

గురువారం ఉదయం తన విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళుతుండగా తైదు పాడు క్రాస్ రోడ్ వద్ద మలుపు తిరుగుతుండగా తిరువూరు వైపు నుండి వస్తున్న కారు అతివేగంగా రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి కొద్ది దూరంలో ఉన్న బడ్డి కొట్టును కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తైదుపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని, గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

CLICK HERE TO READ MORE : Odisha | భార్య‌, కోడ‌లు, మ‌న‌వ‌రాలి హత్య‌

CLICK HERE TO READ MORE :

Leave a Reply