గేదెలపై మొసలి దాడి

గేదెలపై మొసలి దాడి

జైపూర్, ఆంధ్రప్రభ : జైపూర్ శివ్వారం ఎర్ర చెరువులో మొసళ్ళు కలకలం రేపుతున్నాయి. నీరు తాగేందుకు చెరువు దగ్గరకు వచ్చిన గేదెను మొసలి పట్టుకుంది.మొసలిని చూసిన వెంటనే పశువుల కాపరి భయంతో అక్కడి నుంచి పరుగులు తీసి గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో స్థానికులు మొసలిని చూసేందుకు ఆ ప్రాంతానికి వస్తున్నారు. గేదె వెనుక భాగాన్ని మొసలి నోటితో కరిచి లోపలికి లాగుకొని వెళ్ళింది. కాగా రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన గేదెను కూడా మొసలి పట్టుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెల క్రిందట గొర్రెలను కూడా మొసలికి ఆహారం అయినట్లు సమాచారం. అయితే ఈ రెండు గేదలు శివ్వారం గ్రామానికి చెందిన గెల్లు సరక్క, లంబు సంపత్ రెడ్డిలకు చెందినవి. ఒక్కో గదెకు విలువ సుమారు రూ.60 వేలకు పైగా ఉంటుందని రోదిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Leave a Reply