పోచవరంలో మొసలి కలకలం

పోచవరంలో మొసలి కలకలం

గోదారి ఒడ్డున సేదతీరుతోంది

తాళ్లతో బంధించి నదిలోకి విడుదల

(పోలవరం , ఆంధ్రప్రభ)

పోలవరం జిల్లా వి.ఆర్.పురం మండలం పోచవరం బోటింగ్ పాయింట్ వద్ద మొసలి కలకలం సృష్టించింది.  గోదావరి నది ఒడ్డున  ఈ మొసలి  సేద తీరుతున్న తరుణంలో  పాపికొండల విహార యాత్రకు వచ్చిన పర్యాటకులు ఈ మొసలిని గుర్తించారు.  తాళ్లతో   స్థానికులు బంధించి గోదావరి నదిలోకి విడిచిపెట్టారు. ఈ స్థితిలో  గోదావరి నదిలోకి ఎవరు దిగవద్దు అంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply