విజయవాడ అభివృద్ధికి వైసీపీ అడ్డంకి

విజయవాడ అభివృద్ధికి వైసీపీ అడ్డంకి

విజయవాడ, ఆంధ్రప్రభ: విజయవాడ నగర అభివృద్ధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డంకిగా మారిందని టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ విమర్శించారు. నగర అభివృద్ధిపై మాట్లాడే ముందు వైసీపీ నాయకులు తమ వైఖరిని పరిశీలించుకోవాలని అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేత దేవినేని అవినాష్ పై తీవ్ర విమర్శలు చేశారు.

తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని నగర అభివృద్ధి గురించి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, విజయవాడ అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని అన్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో భూముల కబ్జాలు, దౌర్జన్యాలు జరిగినట్లు ప్రజలకు తెలిసిన విషయమని ఆరోపించారు. ముఖ్యంగా ఏలూరు రోడ్డులో పలు ఆస్తుల విషయంలో వివాదాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఇక విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తున్న నాయకుడని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 2.80 లక్షల ఓట్ల మెజారిటీతో ప్రజలు ఆయనపై విశ్వాసం వ్యక్తం చేశారని గుర్తుచేశారు. మహిళా సాధికారత కోసం ఎన్ఐఆర్‌డీ ద్వారా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఎంపీ కేశినేని చిన్ని కృషి చేస్తున్నారని తెలిపారు.

నగర అభివృద్ధి, ప్రజా సేవలో ఆయన చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని పేర్కొన్నారు. కనీసం కార్పొరేటర్‌గా కూడా గెలవని నాయకులు విజయవాడ అభివృద్ధిపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని చరణ్ సాయి యాదవ్ వ్యాఖ్యానించారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల పేర్లు కూడా చెప్పలేని వారు రాజకీయ విమర్శలు చేయడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

Leave a Reply