న్యూ ఢిల్లీ – దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. స్నేహం ముసుగులో యూకేకు చెందిన మహిళా పర్యాటకురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం నిందితుడి స్నేహితుడు కూడా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
యూకేకు చెందిన మహిళా పర్యాటకురాలు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న మహిపాల్‌పూర్‌లో ఒక హోటల్‌లో దిగింది. సోషల్ మీడియాలో పరిచయం అయిన ఓ వ్యక్తి హోటల్‌కు వచ్చాడు. ఇదే అదునుగా భావించిన వ్యక్తి.. ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. వెంటనే అతడి నుంచి తప్పించుకునేందుకు అలారం మోగించింది. అంతేకాకుండా వెంటనే రిసెప్షన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. సాయం చేసేందుకు వస్తున్న వ్యక్తి కూడా లిఫ్ట్‌లో లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు నిందితులు కూడా స్నేహితులే కావడం విశేషం.
రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి సోషల్ మీడియాలో పరిచయం ఉన్న వ్యక్తేనని తెలిపారు. హోటల్‌లో ఆమెను కలిసేందుకు వచ్చి అత్యాచారం చేశాడు. సాయం పేరిట మరో వ్యక్తి కూడా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వెల్లడించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Crime | ఢిల్లీలో ఇంగ్లండ్ పర్యాటకురాలిపై అత్యాచారం
