రౌడీషీటర్లపై పోలీస్ శాఖ స్పెషల్ ఫోకస్…

రౌడీషీటర్లపై పోలీస్ శాఖ స్పెషల్ ఫోకస్…
ఐజీపీ అశోక్ కుమార్
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వివిధ పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఐజీపీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో గంజాయి, క్రైమ్, మహిళలపై దాడుల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టామని వెల్లడించారు. ఎస్పీ పి. విద్యాసాగర్ నేతృత్వంలో గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం క్రైమ్ రేటు గణనీయంగా తగ్గిందని తెలిపారు. రౌడీషీటర్లపై స్పెషల్ నిఘా కొనసాగుతోందని స్పష్టం చేశారు.
కఠిన చర్యలు తప్పవు అని పదే పదే నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ అమలు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీపీ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఐజీపీతో పాటు ఎస్పీ పి. విద్యాసాగర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
