Cricket | చెలరేగిన చిచ్చర పిడుగు

Cricket | చెలరేగిన చిచ్చర పిడుగు
- విజయ్ హజారే ట్రోఫీలో వైభవ్ విధ్వంసం
- తృటిలో డబుల్ సెంచరీ మిస్
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ మరోసారి రెచ్చిపోయాడు. విజయ్ హజారే ట్రోఫీలో తన వీరబాదుడుతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. క్రీజులో ఉన్నంత వరకు సిక్స్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. రాంచీ వేదికగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బిహార్ తరపున బరిలో దిగిన వైభవ్ (Vaibhav) సూపర్ సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 36 బంతుల్లోనే శతకం బాది రికార్డ్ సృష్టించాడు. లిస్ట్ ఏ క్రికెట్లో ఇదే రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం విశేషం.

ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ (190; 84 బంతుల్లో; 16 ఫోర్లు, 15 సిక్స్ లు) తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. వైభవ్ విధ్వంసంతో 30 ఓవర్లు ముగిసే సమయానికి బిహార్ జట్టు 2 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. మరో ఓపెనర్ మంగళ్ మహరూర్ 33 (43 బంతుల్లో, 4 ఫోర్లు) పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో పీయూష్ సింగ్ (37 ; 40 బంతుల్లో, 4 ఫోర్లు), ఆయుష్ లోహరుక (13; 14 బంతుల్లో, 2 ఫోర్లు) కొనసాగుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లలో టెక్కీ నేరి రెండు వికెట్లు తీసుకున్నాడు.

