Cricket | వేములలో క్రికెట్ టౌర్నమెంట్

Cricket | వేములలో క్రికెట్ టౌర్నమెంట్

  • ప్రారంభించిన గ్రామ సర్పంచ్ డి.రాజు

Cricket | ఇటిక్యాల, ఆంధ్రప్రభ : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వేముల గ్రామంలో క్రిస్టమస్ పండుగను పురస్కరించుకొని జై భీమ్ కాలనీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలను సర్పంచ్ డి.రాజు ప్రారంభించారు. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… ఆటల పోటీలు యువకులను శారీరకంగా, దృఢంగా ఉండేందుకు మానసిక ఉల్లాసాన్ని కలుగజేస్తాయన్నారు. పోటీల్లో గెలుపు, ఓటములు సహజమేనన్నారు. అన్నింటిని సమానంగా భావించి క్రీడల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ టౌర్నమెంట్ నిర్వాహకులు, గ్రామ నాయకులు, యువకులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Cricket

Leave a Reply