Crazy Beauty | అందాల రాశీ.. రూటు మార్చిందా…?

Crazy Beauty | అందాల రాశీ.. రూటు మార్చిందా…?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఊహలు గుసగుసలాడే.. సినిమాతో తెలుగు తెరకు(To the Telugu screen with a movie) పరిచయం అయ్యింది అందాల రాశీ. 2014లో ఈ సినిమా రిలీజైంది. అంటే.. 11 సంవత్సరాలుగా సినిమాల్లో నటిస్తుంది. అయితే.. ఈ ముద్దుగుమ్మకు రావాల్సినంత పేరు రాలేదనే మాట ఇండస్ట్రీలో(Word is in the industry) వినిపిస్తుంటుంది. అందం, అభినయం.. రెండూ ఉన్నాయి కానీ.. ఎందుకనో సరైన సినిమా రాలేదు. ఈ కారణం వలనో.. లేక మరో కారణం ఉందో తెలియదు కానీ.. ఈ అమ్మడు ఇప్పుడు రూటు మార్చిందని తెలిసింది. ఇంతకీ.. రాశీ.. రూటు మార్చి ఏం చేస్తుంది..?

Crazy Beauty | రాశీకి రావాల్సిన పేరు రాలేదా..

Crazy Beauty

ఊహలు గుసగుసలాడే సినిమా తర్వాత జోరు, జిల్, శివమ్, బెంగాల్ టైగర్, సుప్రీమ్, హైపర్, జై లవకుశ, తొలిప్రేమ తదితర చిత్రాల్లో(In films like Toliprema and others) నటించింది. అయితే.. ఏ పాత్ర చేసినా ఆ పాత్రకు తగ్గట్టుగా నటిస్తుందనే పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన సినిమాల్లో కొన్ని హిట్స్ అయ్యాయి కానీ.. బ్లాక్ బస్టర్ అనేలా సక్సెస్ సాధించకపోవడంతో రావాల్సినంత పేరు అయితే రాశీకి రాలేదని మాట తరుచుగా వినిపిస్తుంటుంది. మెగా హీరో సాయిదుర్గతేజ్(Mega hero Saidurgatej) నటించిన ప్రతిరోజు పండగే, విక్టరీ వెంకటేష్‌, యువసమ్రాట్ నాగచైతన్య కాంబోలో రూపొందిన వెంకీమామ సినిమాలో రాశీ నటించింది. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి కానీ.. ఆ సినిమాలు ఈ అమ్మడు కెరీర్ కు ప్లస్ అవ్వలేదు.

Crazy Beauty | అక్కడ కూడా అదే పరిస్థితి..

Crazy Beauty

తెలుగులో పరిస్థితి ఇలా ఉంటే.. తమిళ్ లో తన అదృష్టాన్ని(His luck in Tamil) పరీక్షించుకుందామని అక్కడకు వెళ్లింది. ఇమ్మయిక్కా నోడిగల్, అదంగమరు, అయోగ్య, సంఘతమిజాన్ తదితర చిత్రాల్లో నటించింది కానీ.. అక్కడ కూడా చెప్పుకోదగ్గ సక్సెస్ రాలేదు. ఇక కెరీర్ ప్రారంభమే బాలీవుడ్ మూవీ మద్రాస్ కేఫ్(Bollywood movie Madras Cafe) అనే సినిమాతో స్టార్ట్ చేసింది. అక్కడ అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ కు వచ్చింది. ఈ మధ్య హిందీలో 120 బహుద్దూర్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా ఆడలేదు. ఈ సంవత్సరం తెలుగులో తెలుసు కదా అనే సినిమాలో నటించింది. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. అలాగే తమిళ్, హిందీలో నటించిన సినిమాలు కూడా ఫ్లాప్(Movies are also flops) అయ్యాయి.

Crazy Beauty | ఐటం సాంగ్ కు ఓకే చెప్పిందా..

Crazy Beauty

తను నటించిన సినిమాలు సక్సెస్(Movies are a success) అవ్వకపోవడం వలనేమో ఇప్పుడు ఈ అమ్మడు ఐటం సాంగ్ కు సై అంది.. ఐటం సాంగా.. లేక స్పెషల్ సాంగా అనేది పక్కపపెడితే.. వేరే సినిమాలో సాంగ్ చేసేందుకు ఓకే చెప్పింది. ఇంతకీ ఏ సినిమా అంటే.. అనగనగా ఒక రాజు సినిమాలో. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన అనగనగా ఒక రాజు సినిమా సంక్రాంతికి థియేటర్స్(Cinema theaters for Sankranthi) లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. ఈ మూవీ సక్సెస్ పై నిర్మాత నాగవంశీ చాలా నమ్మకంగా ఉన్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయిక(Meenakshi Chowdhury is the heroine). అయితే.. ఈ మూవీకి స్పెషల్ ఎట్రాక్షన్ కోసం రాశీ ఖన్నాతో ఐటం సాంగ్ చేయిస్తున్నారని సమాచారం. అయితే.. సరైన సక్సెస్ లేక.. సరైన సినిమాలు లేక ఇలా సాంగ్ చేసేందుకు ఒప్పుకుందా అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

Crazy Beauty | ఉస్తాద్ తో రాశీ..

Crazy Beauty

2025 ఇయర్ రాశీ ఖన్నాకు ఏమాత్రం బాలేదు. అయితే.. 2026లో అనగనగా ఒక రాజు సినిమాలో ఐటం సాంగ్(Item song in Raju movie) తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో రానుంది. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ(Ustad Bhagat Singh movie) పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. అలాగే హిందీలో రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మొత్తానికి రాశీకి 2026 బాగా కలిసొచ్చేలా ఉంది. మరి.. రాశీ కొత్త సంవత్సరం(Rashi New Year)లో ఫామ్ లోకి వస్తుందేమో చూడాలి.

CLICK HERE TO READ అంచనాలు పెంచేసిన రాజాసాబ్ ట్రైలర్

CLICK HERE TO READ MORE

Leave a Reply