భారీగా ఇసుక, మొరం అక్రమ డంపుల పట్టివేత

భారీగా ఇసుక, మొరం అక్రమ డంపుల పట్టివేత

ఆకస్మిక దాడులు చేసిన ఆర్డీవో, ఎమ్మార్వో

పరకాల, ఆంధ్ర ప్రభ: పట్టణంలో ఇసుక, మొరం అక్రమ డప్పులపై రెవెన్యూ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా పట్టణంలోని భూపాలపల్లి రోడ్ లో గల అక్రమ ఇసుక, మొరం విల్వలా భారీ డంపులను పట్టుకున్నారు. పరకాల ఆర్డిఓ డాక్టర్ నారాయణ నేతృత్వంలో పరకాల ఎమ్మార్వో విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ అక్రమ ఇసుక, మొరం డంపులను పట్టుకోవడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ దాడులలో పరకాల ఎమ్మారై దామోదర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply