CPM Party | పోరాటం తప్పదు..

CPM Party | పోరాటం తప్పదు..
CPM Party | కొత్తూరు, ఆంధ్రప్రభ : శ్రీకాకుళం జిల్లాకు గుండెకాయ వంటి వంశధార రిజర్వాయర్ వెంటనే పూర్తి చేయకపోతే పోరాటం తప్పదని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యులు సిర్ల ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ రోజు కొత్తూరు మండల కేంద్రంలో సీపీఎం పార్టీ కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ.. వంశధార రిజర్వాయర్ కు నీరు రావాలంటే.. నేరడి బ్యారేజీ నిర్మాణం జరగాలని లేదా తక్షణం లిఫ్టుల ద్వారా రిజర్వాయర్ నింపి రెండు పంటలకు నీరు ఇస్తే.. జిల్లాలో రెండు లక్షల 50 వేలు ఎకరాలుకు గ్యారంటీగా నీరు అందించి సంవత్సరానికి జిల్లాకు 2000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని అన్నారు. దీని వలన ప్రజల ఆదాయం పెరుగుతుంది. ప్రజలు కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వారా అనేక అనుబంధ పరిశ్రమలు వస్తాయి. కూలీలకు ఉపాధి దొరుకుతుంది వలసల నివారించబడతాయి. జిల్లా అభివృద్ధి చెందాలంటే.. ప్రజల భూములను కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం ద్వారా కాదని సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం ద్వారానే సాధ్యమని వారన్నారు.
శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలంటే.. వంశధార జలాలని వినియోగించడం ద్వారా ప్రజల ఆదాయం రెట్టింపు అవుతుందని వారు తెలిపారు. జిల్లా అభివృద్ధి చెందాలంటే.. రిజర్వాయర్ పూర్తి చేస్తే దానికి అయ్యే ఖర్చు ఏడాదిలోనే వస్తుందని మరి ఎందుకు పూర్తి చేయడం లేదో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని, బడ్జెట్లో ఎందుకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించడం లేదని వారు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా వెనుకబాటుకు కారణం పాలకుల నిర్లక్ష్యమే అని వారు విమర్శించారు. పాలకుల విధానాలు వలన జిల్లా వెనుకకు నెట్టబడుతుందని ఆదాయం కోల్పోతుందని అన్నారు. గొట్టా బ్యారేజ్ నిర్మాణం జరిగిన 50 ఏళ్ళు పూర్తయి శిధిలావస్థకు చేరుకుందని వారు అన్నారు.
గొట్టా బ్యారేజ్ ఆధునీకరణకు 1500 కోట్లు రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. వంశధార రిజర్వాయర్ 21 గ్రామాల ప్రజలు త్యాగాలతో నిర్మించారని నీరు రాకపోవడంతో అదొక పెద్ద చెరువుగా, నిరుపయోగంగా మిగిలిపోతుందని అన్నారు. వంశధార ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన నిర్వాసితులను ఆదుకోవాలని, జిల్లాలో ఐటిడిఎ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వంశధార నది జలాలను చివరి భూముల వరకు నీరు ఇవ్వాలని వంశధార బ్యారేజ్ ఆధునీకరణ చేయాలని, జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు ఎన్. అప్పన్న, ప్రజా సంఘాల నాయకులు, రమేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
