ఓం గణేష్ మార్వాడి పాన్ బ్రోకర్ షాప్ సీజ్ చేయాలి..

ఓం గణేష్ మార్వాడి పాన్ బ్రోకర్ షాప్ సీజ్ చేయాలి..
- లైసెన్స్ రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
- సిబిసిఐడి విచారణతో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరపాలి
- ఆర్టీవో కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా
- సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాపర్తి రాజు
స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో ఉన్న ఓం గణేష్ మార్వాడి పాన్ బ్రోకర్ మార్వాడి వడ్డీ వ్యాపారి షాపును తక్షణమే సీజ్ చేయాలి. లైసె న్స్ రద్దు చేయాలి. క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీవో కార్యాల యం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం రైతులను అవ మానించే విధంగా ప్రవర్తించిన ఓం గణేష్ పాన్ బ్రోకర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు ఆర్డీవో వెంకన్నకు వినతి పత్రం అందజేశారు.

అనంతరం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మునిగేల రమేష్ అధ్యక్షత వహించగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాపర్తి రాజు మాట్లాడారు. ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతన్నలు అవసరాల కోసం పాన్ బ్రోకర్లను ఆశ్రయిస్తే, వారి అమాయక త్వాన్ని ఆసరాగా చేసుకుని 3 శాతం నుంచి 6 శాతం వరకు అధిక వడ్డీలు వసూలు చేయ డం దారుణమన్నారు. వడ్డీ చెల్లించలేకపోతే బంగారం స్వాధీనం చేసు కోవడం మరింత అన్యాయమని మండిపడ్డా రు. అదే విధంగా వడ్డీ చెల్లించాలంటూ రైతులను కాళ్లు మొక్కాలి అంటూ బూతులు తిట్టిన ఘటనపై తీవ్రంగా అగ్రహాం వ్యక్తం చేశారు.

ఇదే కాకుండా అనేక మంది బాధితులు ఉన్నారని, వారు ఫిర్యాదు చేస్తే వెంటనే వారి బంగారం తిరిగి ఇప్పించాలన్నారు. నిబంధనలకు విరుద్ధం గా కోట్ల రూపాయలు కూడబెట్టుకుంటున్న పాన్ బ్రోకర్ల ఆస్తులపై అవినీ తి నిరోధక శాఖతో సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నష్టపోయిన బాధితులకు గోల్డ్ తిరిగి అందజేయాలని ఉన్నతా ధికారులను కోరారు. ఎలాంటి అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృ తం చేస్తామని, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకొని పోరాటం చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు చిలు ముల్ల భాస్కర్, మంద మహేందర్, ఇప్పగూడెం ఉప సర్పంచ్ లింగన బోయిన రాజు, బి.యాకన్న, రాథోడ్ బి.ఆర్య తదితరులు పాల్గొన్నారు.
